Pushp Box Office Collection: ‘పుష్ప’ రికార్డుల వేట మాత్రం ఆపడం లేదు

Pushp Box Office Collection: ‘పుష్ప’ను అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులు కూడా బాగా మెచ్చుకున్న సంగతి తెలిసిందే. మెచ్చుకునే క్రమంలో పుష్ప డైలాగ్స్ ను, పోస్టర్స్ బాగా వాడుకున్నారు కూడా. అసలు ఎక్కడ చూసిన ‘పుష్ప’ ఫీవరే కనిపించింది ఆ మధ్య. పైగా ఆ మధ్య పుష్ప సినిమా సృష్టించినంత ప్రభంజనం మరే చిత్రం సృష్టించలేదనే చెప్పాలి. మొన్నటివరకు థియేటర్లలో సందడి చేసి, క్రికెటర్లతోనూ స్టెప్పులేయించిన ఈ సినిమా, తర్వాత ఓటీటీలోనూ విజయ […]

Written By: Shiva, Updated On : April 1, 2022 3:22 pm
Follow us on

Pushp Box Office Collection: ‘పుష్ప’ను అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులు కూడా బాగా మెచ్చుకున్న సంగతి తెలిసిందే. మెచ్చుకునే క్రమంలో పుష్ప డైలాగ్స్ ను, పోస్టర్స్ బాగా వాడుకున్నారు కూడా. అసలు ఎక్కడ చూసిన ‘పుష్ప’ ఫీవరే కనిపించింది ఆ మధ్య. పైగా ఆ మధ్య పుష్ప సినిమా సృష్టించినంత ప్రభంజనం మరే చిత్రం సృష్టించలేదనే చెప్పాలి. మొన్నటివరకు థియేటర్లలో సందడి చేసి, క్రికెటర్లతోనూ స్టెప్పులేయించిన ఈ సినిమా, తర్వాత ఓటీటీలోనూ విజయ దుందుభి మోగించింది.

Pushp Box Office Collection

అయినా ఈ చిత్రంపై క్రేజ్‌ తగ్గలేదు. ఇటీవల టీవీలో ప్రదర్శితమవగా, బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సూర్యవంశీని కాదని పుష్పనే ఎక్కువగా చూశారు. పుష్ప టీవీ రేటింగ్స్‌ 4.35 ఉంటే, సూర్యవంశికి 2.7 మాత్రమే లభించింది. ఇది నిజంగా విశేషమే. వాస్తవానికి పుష్ప హిందీలో క్లీన్ హిట్ గా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 83 చిత్రం నుండి తీవ్ర పోటీ ఎదుర్కొన్న పుష్ప రికార్డు వసూళ్లు రాబట్టింది.

ఒక విధంగా చెప్పాలంటే లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ 83 వసూళ్లకు పుష్ప గండి కొట్టింది. బి,సి సెంటర్స్ లో పుష్ప 83 మూవీ కంటే మెరుగైన వసూళ్లు రాబట్టింది. పుష్ప హిందీ వర్షన్ రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించినట్లే అంటున్నారు. ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుండి హిందీ బెల్టులో అంత క్రేజ్ ఉన్న హీరోగా అల్లు అర్జున్ అవతరించాడని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Pushpa Movie

పుష్ప చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ రీత్యా… బన్నీ పాత హిట్ చిత్రాలు హిందీ వర్షన్ లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యి బన్నీ రేంజ్ ను రెట్టింపు చేసింది.

ప్రస్తుతం ‘పుష్ప పార్ట్ 2’ పై సుకుమార్ కసరత్తులు స్టార్ట్ చేశాడు. ఇంతకీ, సుక్కు – బన్నీ ‘పుష్ప2’ పై ఏం చేయనున్నారు ? అనే కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. నిజానికి అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌ అంటేనే ఫుల్ క్రేజ్. అంచనాలు బారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడం అంత ఈజీ కాదు. అందుకే, ‘పుష్ప’ పార్ట్ 2 పై క్రేజ్ డబులు అయ్యింది.

 

Tags