https://oktelugu.com/

రేవంత్ రెడ్డి ముందు ఎన్నో సవాళ్లు..!

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై  తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఊపు వచ్చింది. ఇన్నాళ్లు వరుస ఓటమిలతో కళావిహీనంగా మారిన గాంధీభవన్ ఇకనైనా కొత్త ఉత్సాహం నెలకొంటుందా..? అన్న చర్చ సాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి నియామకం ముందు పెద్ద తతంగం నడిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇతర పార్టీల కంటే సొంత పార్టీ నాయకులను మెప్పించే విధంగా రేవంత్ రెడ్డి పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీపడిన వారిని మెప్పించేలా […]

Written By:
  • NARESH
  • , Updated On : June 28, 2021 / 11:07 AM IST
    Follow us on

    టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై  తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఊపు వచ్చింది. ఇన్నాళ్లు వరుస ఓటమిలతో కళావిహీనంగా మారిన గాంధీభవన్ ఇకనైనా కొత్త ఉత్సాహం నెలకొంటుందా..? అన్న చర్చ సాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి నియామకం ముందు పెద్ద తతంగం నడిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇతర పార్టీల కంటే సొంత పార్టీ నాయకులను మెప్పించే విధంగా రేవంత్ రెడ్డి పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీపడిన వారిని మెప్పించేలా రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహం రచిస్తాడో మరి.
    2014 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ వరుస ఓటమిలతో సతమతవుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీకి కొన్ని సీట్లు వచ్చినా ఆ తరువాత వారు టీఆర్ఎస్ పార్టీలోకి వలసవెళ్లారు. ఇక 2019లోనూ అదే పరిస్థితి ఎదురైంది. ఈ ఎన్నికల్లోల గెలిచిన సబితారెడ్డి టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూ మూడు సీట్లు రావడం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా మారిందనడానికి నిదర్శనంగామారింది.
    రేవంత్ రెడ్డి ఇలా ఉన్న కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడోనన్న ఆసక్తి నెలకొంది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి మొదటి నుంచీ యూత్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన ఎప్పుడూ దూకుడుగానే వ్యవహరించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా తన రాజకీయ వ్యూహంతో ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా అప్పుడప్పడు పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు.
    తాజాగా ఆయనపై హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాల్ కానుంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటలను ఎదుర్కోవడానికి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుడు టీఆర్ఎస్ లోకి చేరుతారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ఇప్పటి వరకు అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. అయితే మొన్నటి వరకు టీఆర్ఎస్ వైపు చూసిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి పదవి దక్కడంతో ఆయనకాంగ్రెస్ లోనూ ఉండిపోతారా..? అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ వస్తే చాలని ఎంపీ కోమటిరెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి వ్యూహంతో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ మారుస్తాడా..? లేదా..? చూడాలి.