Manikkam Tagore: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టీఆర్ఎస్ అలుపెరగని శక్తిగా ఉంది. ఆ పార్టీ ఏదంటే అది చేయగల సత్తాను కలిగి ఉంది. కేంద్రంలోని బీజేపీని కూడా ఎదురిస్తూ సై అంటే సై అంటోంది. తిరుగులేకుండా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు తన ప్రత్యర్థిగా కేవలం బీజేపీని మాత్రమే చూస్తోంది. కానీ తెలంగాణ వ్యాప్తంగా బలం లేని బీజేపీ కన్నా ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకునే పనిలో పడింది.

ఇప్పటికే కుమ్ములాటలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని ఓ దారిలో పెడుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మణిక్యం ఠాగూర్. అసమ్మతి రాజేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు ఇటీవలే రాహుల్ గాంధీ చేత క్లాస్ ఇప్పించారు. ఈ క్రమంలోనే వచ్చేసారి అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్ పై యుద్ధానికి సన్నద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి చెడుగుడు ఆడేశాడు.
బంగారు తెలంగాణలో క్రైమ్ & టిఆర్ఎస్ రాజకీయ నాయకులు పరస్పర సంబంధం కలిగి ఉన్నారని మాణిక్యం ఠాగూర్ ఆరోపించారు. క్రైమ్ , రాజకీయాలు, పోలీసులు సిండికేట్ గా మారాయని.. ఈ టీఆర్ఎస్ నుంచి తెలంగాణ విముక్తి చేయాలంటూ పిలుపునిచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్, మాణిక్యం ఠాగూర్ వచ్చాక దూకుడు వచ్చింది. పైగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కు కేడర్, నాయకత్వ బలం ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ ను కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పరిస్థితులపై మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
How Crime & TRS politicians are interconnected in Bangaru Telangana ? Telangana need to free itself from the Syndicate Crime+ Politics+ Police. Will Telangana do ? https://t.co/A1JwvIdxqq
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) April 18, 2022
[…] Also Read: Manikkam Tagore: క్రైమ్+ రాజకీయాలు+ పోలీసుల సిండ… […]