BJP Manifesto : మేనిఫెస్టో లీక్.. బీజేపీ ఎన్నికల పథకాలు ఇవే

కేవలం ఈ వర్గాలు మాత్రమే కాకుండా.. భారత దేశ సమున్నత అభివృద్ధి కోసం 3.0 తీరుగా మరిన్ని విప్లవాత్మక మార్పులను మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు ప్రచారం జరుగుతుంది. బీజేపీ ఏప్రిల్ 10న మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఇండియా కూటమి కూడా మేనిఫెస్టోను బహిర్గతం చేస్తుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

Written By: NARESH, Updated On : April 4, 2024 8:32 pm

Manifesto leak.. These are the election schemes of BJP

Follow us on

BJP Manifesto : పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తొలి విడతగా ఏప్రిల్ 19న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కు సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు అని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తొలి దశ ఓటింగ్ కు మరికొద్ది రోజులే ఉన్నప్పటికీ ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రకటించలేదు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 10న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.. మోడీ గ్యారెంటీ, గ్రోత్ భారత్ 2047పేరుతో ఈ మేనిఫెస్టో ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు సభల్లో ఈ దేశంలో నాలుగే కులాలు ఉన్నాయని.. అవి పేదలు, యువత, రైతులు, మహిళలు మాత్రమే అని చెప్పారు. మోడీ ఆ మాటలు అన్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ నాలుగు వర్గాలకు లబ్ధి కలిగించే విధంగా కొత్త పథకాలకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఈ మేనిఫెస్టో రూపకల్పన కోసం బీజేపీ 27 మంది సభ్యులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యవహరించారు. ఈ మేనిఫెస్టోలో గత పది సంవత్సరాలలో బీజేపీ చేసిన పనులు, నెరవేర్చిన హామీలతో పాటు వచ్చే ఐదు సంవత్సరాలల్లో ఏం చేస్తామనే విషయాలను పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు పొందుపరచాలనే దానిపై బీజేపీ ప్రజలనుంచి అభిప్రాయాన్ని సేకరించింది. ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారమే పలు పథకాలకు రూపకల్పన చేశారని సమాచారం.. ఎన్నికల కోణంలో కాకుండా ప్రజల జీవితాలు మార్చే విధంగా ఈ పథకాలు తీసుకొస్తున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్న నేపథ్యంలో.. ఈ మేనిఫెస్టో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

యువత కోసం ఉపాధి మార్గాలు.. స్వయం ఉపాధిని ఎంచుకునే యువత కోసం రుణాలు.. మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు మార్గాలు.. వాటి ద్వారా సృష్టించే ఉద్యోగాలు.. రైతులు వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకునేందుకు ప్రణాళికలు.. రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రాయితీలు.. పేదల కోసం ఇళ్ళు.. వారు ఆర్థికంగా ఎదగడానికి మార్గాలు.. ఈ అంశాల ఆధారంగా బిజెపి మేనిఫెస్టో రూపొందించినట్టు తెలుస్తోంది. కేవలం ఈ వర్గాలు మాత్రమే కాకుండా.. భారత దేశ సమున్నత అభివృద్ధి కోసం 3.0 తీరుగా మరిన్ని విప్లవాత్మక మార్పులను మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు ప్రచారం జరుగుతుంది. బీజేపీ ఏప్రిల్ 10న మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఇండియా కూటమి కూడా మేనిఫెస్టోను బహిర్గతం చేస్తుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.