https://oktelugu.com/

Naresh – Pavitra Lokesh : 1500 కోట్ల కోసమే నరేష్ తో ఎఫైర్.. పవిత్ర లోకేష్ మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు!

అయితే నరేష్ మాత్రం ఆమెను పూర్తిగా నమ్ముతున్నాడు. తనను అర్థం చేసుకునే తోడు దొరికిందని సంబర పడుతున్నారు. అయితే పవిత్రతో అయినా ఆయన బంధం శాశ్వతంగా కొనసాగుతుందా? అనే సందేహాలు ఉన్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : April 4, 2024 / 08:22 PM IST

    Naresh - Pavitra Lokesh

    Follow us on

    Naresh – Pavitra Lokesh : నటుడు నరేష్ గత ఏడాది పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. పవిత్ర లోకేష్ కి గతంలో పెళ్లై పిల్లలు ఉన్నారు. భర్తకు విడాకులు ఇచ్చి నరేష్ తో సహజీవనం చేస్తుంది. నరేష్ వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్నాడు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఒక్కటి కూడా సవ్యంగా సాగలేదు. ఆయన మొదటి వివాహంగా సీనియర్ డాన్సర్ మాస్టర్ శ్రీను కుమార్తెను చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు పుట్టాడు. కొంతకాలానికి మనస్పర్ధలతో విడిపోయారు.

    అనంతరం రేఖా సుప్రియ ఆమె అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కూడా విభేదాలు వచ్చి .. విడాకులు తీసుకున్నారు. ముచ్చటగా రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకున్నాడు. రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వలేదు. నరేష్-రమ్య రఘుపతి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. రమ్యతో విడాకుల కేసు నడుస్తుండగానే… నరేష్ నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ పెట్టుకున్నాడు. ఐదేళ్లకు పైగా వారి రిలేషన్ కొనసాగింది. ఓ రెండేళ్ల క్రితం పవిత్రతో సహజీవనం చేస్తున్నట్లు నరేష్ అఫీషియల్ గా ప్రకటించారు.

    పవిత్ర తో చాలా సంతోషంగా ఉన్నట్లు పలు ఇంటర్వ్యూల్లో నరేష్ చెప్పుకొచ్చాడు. కానీ పవిత్ర లోకేష్ మాజీ భర్త మాత్రం ఆమె డబ్బు మనిషి అని, కేవలం ఆస్తులు, లగ్జరీ లైఫ్ కోసం నరేష్ తో ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం ఆయన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర మాట్లాడుతూ.. నరేష్ వద్ద రూ. 1500 కోట్ల ఆస్తి ఉందని ఆమెకు తెలుసు. అందుకే అతడితో రిలేషన్ పెట్టుకుంది.

    అతని వయసు 60 ఏళ్లు పైబడి ఉన్నప్పటికీ కేవలం డబ్బు కోసం భర్తగా అంగీకరించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బు కోసం తనతో తెగతెంపులు చేసుకుందని ఆయన వెల్లడించారు. అయితే నరేష్ మాత్రం ఆమెను పూర్తిగా నమ్ముతున్నాడు. తనను అర్థం చేసుకునే తోడు దొరికిందని సంబర పడుతున్నారు. అయితే పవిత్రతో అయినా ఆయన బంధం శాశ్వతంగా కొనసాగుతుందా? అనే సందేహాలు ఉన్నాయి.