Manchu Manoj- TDP: మంచు ఫ్యామిలీలో ఫాలోయింగ్ ఉన్న హీరో మనోజ్. మంచి నటుడు, పైగా మంచి మనిషి. ఇది ఇండస్ట్రీలో మనోజ్ కి ఉన్న నేమ్. కానీ కాలం కరుణించలేదు. అన్నీ ఉన్నా.. స్టార్ కాలేకపోయాడు. అయితే, మనోజ్ ఈ సారి తన గేమ్ ప్లాన్ మార్చాడా ?, రంగులు వేసుకుని తెర పై కోతి వేషాలు వేయడం కంటే.. రాజకీయ తెర పై సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేయడమే బెటర్, బెనిఫిట్ అనుకున్నాడా ?. ఈ క్రమంలోనే మనోజ్ – భూమా మౌనిక రెడ్డి పెళ్లి వెలుగులోకి వచ్చిందా ?.
ఈ విషయాలకి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎప్పుడైతే.. ఓ వినాయక మండపంలో భూమా మౌనికతో కలిసి మనోజ్ కనిపించాడో.. అప్పటి నుంచి పెద్ద ఎత్తున వీరి పెళ్లి పై డిస్కషన్స్ షురూ అయ్యాయి. కానీ, క్లారిటీ లేదు. అటు మనోజ్ గానీ, ఇటు భూమా ఫ్యామిలీ గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చాడు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు.
Also Read: Pawan Kalyan- YCP: పవన్ జోలికి వెళ్లోద్దు.. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు..
ఆయన వీరిద్దరి ప్రేమ సంగతి క్లుప్తంగా వివరించాడు. ఇంతకీ, గోనె ప్రకాష్ రావు ఏం చెప్పారంటే.. ‘భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ రిలేషన్ ఇప్పటిది కాదు. ఆ ఇద్దరూ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. కానీ, అప్పట్లో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వీళ్లిద్దరి పెళ్లికి అంగీకారం తెలపలేదు. ఆ కారణంగానే ఇద్దరూ వేరే వేరే పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఇద్దరికీ డివోర్స్ అయ్యాయి.
ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించింది. కలిశారు. పైగా మనోజ్-మౌనిక లు చాలా కాలంగా కలిసే ఉంటున్నారు. అంటే సహజీవనం చేస్తున్నారు. వీరి సహజీవనం గురించి ఇరు కుటుంబాలతో పాటు రాయలసీమలో లక్షలాది మందికి, హైదరాబాద్ లోని సన్నిహితులకు బాగా తెలుసు. అలాగే ఇద్దరు మంచి ముహూర్తం చూసి పెళ్లి కబురు చెప్పాలని అనుకుంటున్నారు’ అంటూ గోనె ప్రకాష్ రావు చెప్పారు.
అలాగే మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు గోనె. త్వరలోనే మంచు మనోజ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు. అతను చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది’ అంటూ గోనె బాంబ్ పేల్చాడు. మొత్తానికి ఆయన ఇలా చెప్పడంతో మనోజ్ రాజకీయం పలు చర్చలకు తావిచ్చింది. ఇప్పటికే వైసీపీ లో ఉంది మంచు ఫ్యామిలీ. కాకపోతే.. ఈ మధ్య మోహన్ బాబు, సీఎం జగన్ మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. కాబట్టి, మనోజ్ చూపు తెలుగు దేశం వైపు ఉండొచ్చు.
Also Read:Queen Of Elizabeth: బ్రిటన్ రాణి కోసం 30 ఏళ్ల కిందటే శవపేటిక తయారీ.. ఇందులో సంచలన విషయాలివీ