https://oktelugu.com/

Pawan Kalyan- YCP: పవన్ జోలికి వెళ్లోద్దు.. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు..

Pawan Kalyan- YCP: జనసేనాని పవన్ విషయంలో వైసీపీ జాగ్రత్త పడిందా? ఎదురుదాడికి దిగితే అసలుకే మోసం వస్తుంది అని గ్రహించిందా? కొద్దిరోజులు పవన్ జోలికి వెళ్లొద్దని నిర్ణయం తీసుకుందా? పవన్ విషయంలో ఆచీతూచీ వ్యవహరించాలని శ్రేణులకు ఆదేశించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల పవన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి అలవికాని హామీలిచ్చిందని చెబుతూనే అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి […]

Written By: Dharma, Updated On : September 20, 2022 11:59 am
Follow us on

Pawan Kalyan- YCP: జనసేనాని పవన్ విషయంలో వైసీపీ జాగ్రత్త పడిందా? ఎదురుదాడికి దిగితే అసలుకే మోసం వస్తుంది అని గ్రహించిందా? కొద్దిరోజులు పవన్ జోలికి వెళ్లొద్దని నిర్ణయం తీసుకుందా? పవన్ విషయంలో ఆచీతూచీ వ్యవహరించాలని శ్రేణులకు ఆదేశించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల పవన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి అలవికాని హామీలిచ్చిందని చెబుతూనే అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో వైసీపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. పవన్ జనసేన లీగల్ సెల్ ప్రతినిధుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన రాజకీయ విధానాలను ప్రకటిస్తూనే.. వైసీపీ చేస్తున్న తప్పిదాలను ప్రస్తావించారు. వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని కూడా ప్రకటించారు. ప్రజలు ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరని కూడా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ 45 స్థానాలకే పరిమితమవుతుందని కూడా జోష్యం చెప్పారు. దీంతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. ఆ పార్టీ కింది స్థాయి నేత నుంచి మంత్రుల వరకూ తమకు అలవాటైన ఎదురుదాడికి సిద్ధమయ్యారు. కానీ వైసీపీ అధిష్టానం మాత్రం వద్దని వారించినట్టు తెలుస్తోంది.

Pawan Kalyan- YCP

Pawan Kalyan- jagan

పవన్ ఏది మాట్లాడిన ఒక పద్ధతి ప్రకారం మాట్లాడతారు. రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. మొన్న ఆయన మాటల్లో కూడా ఎక్కువగా ఇదే ధ్వనించింది. మీ సోదరితో విభేదాలుంటే కలిసి మాట్లాడతారని.. ఆస్తి పంపకాలను సవ్యంగా చేసుకుంటారని.. మరి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎందుకు రాజీ పడుతున్నారని సూటిగా జగన్ నే ప్రశ్నించారు. మీ 300 ఎకరాల సొంత ఆస్తుల కోసం తెలంగాణకు వేలాది ఎకరాల దారాధత్తం చేశారని కూడా ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా కప్పు టీ, పెసరట్టు ముక్క కోసం ఆశపడుతున్నారంటూ షటైర్లు వేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ తో అంటగాకుతున్నారని.. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారని జగన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ రాజీ ధోరణిని అవలంభిస్తున్నారని ప్రజలకు గట్టి సంకేతాలనైతే పవన్ పంపారు.

Also Read: Cruise Missiles: దేశంలోనే పవర్ ఫుల్ వెపన్ తయారు చేస్తున్న తెలంగాణ.. కేంద్రం ఇక్కడే ఎందుకు పెట్టిందంటే?

ఇటీవల రాష్ట్రంలో జనసేన బలపడుతుందని సర్వేలు చెబుతున్నాయి. విశ్లేషకులుకూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే నివేదికలు కూడా జగన్ వద్ద ఉన్నాయి. జనసేనకు సంస్థాగత నిర్మానం లేకున్నా పవన్ కు మాత్రం రోజురోజుకూ చరిష్మ పెరుగుతోందని కూడా ప్రభుత్వానికి సమాచారం ఉంది. అటు వైసీపీ నేతలు నిత్యం పవన్ నామస్మరన చేయడం కూడా ఆయన గ్రాఫ్ పెరగడానికి ఒక కారణమని నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. తెల్లవారు లేచింది మొదలు కొంతమంది వైసీపీ నేతలు అదే పనిగా పవన్ ను విమర్శిస్తుండడం, జనసేనను చులకన భావంతో చూస్తుండడం ప్రజల్లో జనసేన పట్ల, పవన్ పట్ల ఒక రకమైన సానుభూతి పెరగడానికి కారణంగా తెలుసుకున్నారు. అది ముదిరితే మాత్రం అసలుకే ఎసరు వస్తుందని.. అవి రాజకీయంగా జనసేనకు లాభించే అవకాశముందని తెలయడంతో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. పవన్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయద్దంటూ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

Pawan Kalyan- YCP

Pawan Kalyan- YCP

పవన్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన ప్రతీసారి గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, కన్నబాబు వంటి మంత్రులు రంగంలోకి దిగుతారు. ఉన్నదీ లేనిదీ కూడా మాట్లాడతారు. చంద్రబాబుకు దత్తపుత్రుడిగా అభివర్ణిస్తారు. అంబటి రాంబాబు అయితే పవన్ వస్త్రధారణపై కూడా వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. కానీ మొన్న పవన్ లీగల్ సెల్ సమావేశంలో మాట్లాడిన తరువాత వీరెవరూ మాట్లాడిన సందర్భాలు లేవు. కేవలం మాజీ మంత్రి పేర్ని నానిమాత్రమే మాట్లాడారు. అది కూడా చిరంజీవి మంచి వాడు. చిరంజీవిని పవన్ ద్రోహం చేశాడంటూ కొత్త పల్లవిని అందుకున్నారే తప్ప పాత ఆరోపణలేవీ చేయలేదు. కానీ ఇతరులెవరూ స్పందించిన దాఖలాలు లేవు. వైసీపీ అధిష్టానం ఆదేశాల్లో భాగంగానే ఎవరూ స్పందించలేదని తెలుస్తోంది. అయితే మున్ముందు పవన్ తన వాయిస్ ను పెంచే అవకాశమైతే మాత్రం ఉంది.

Also Read:Renuka Chowdhury- Kodali Nani: గుడివాడ బరిలో రేణుకా చౌదరి…ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్న కొడాలి నాని

Tags