https://oktelugu.com/

శోభనం రోజే.. వధువరులకు చివరి రోజు

పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు హాయిగా జీవించాల్సిన జంట తెల్లరేసరికి మృతిచెందడం ప్రతీఒక్కరిని కలిచివేస్తోంది. పెళ్లి సమయంలో జరిగిన చిన్నపాటి గొడవ నవదంపతుల చావుకు కారణమవడం శోచనీయంగా మారింది. పెళ్లయి 24గంటలు గడవముందే వధూవరులు మృతిచెందిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తొలిరాత్రే వధువును వరుడు హత్యచేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. తిరువళ్ళూరు జిల్లా పొన్నేరిలోని సోమంజేరి గ్రామానికి చెందిన నివాసన్ అనే యువకుడికి సాదనకుప్పంకు చెందిన తమ సమీప బంధువు సంధ్యతో బుధవారం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 11, 2020 / 08:12 PM IST
    Follow us on


    పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు హాయిగా జీవించాల్సిన జంట తెల్లరేసరికి మృతిచెందడం ప్రతీఒక్కరిని కలిచివేస్తోంది. పెళ్లి సమయంలో జరిగిన చిన్నపాటి గొడవ నవదంపతుల చావుకు కారణమవడం శోచనీయంగా మారింది. పెళ్లయి 24గంటలు గడవముందే వధూవరులు మృతిచెందిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తొలిరాత్రే వధువును వరుడు హత్యచేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

    తిరువళ్ళూరు జిల్లా పొన్నేరిలోని సోమంజేరి గ్రామానికి చెందిన నివాసన్ అనే యువకుడికి సాదనకుప్పంకు చెందిన తమ సమీప బంధువు సంధ్యతో బుధవారం ఉదయం పెళ్లయింది. తమిళనాడులో లాక్డౌన్ కారణంగా పెళ్లి వేడుక కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. అయితే పెళ్లి జరుగుతున్న సమయంలోనే పెళ్లికూతురుకు పెళ్లికొడుకుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారి బంధువులు కలుగజేసుకొని ఇద్దరి సర్దిచెప్పారు. అక్కడి నుంచి వారికి ఇంటికి తీసుకెళ్లారు.

    ఇద్దరికి ఫస్ట్ నైట్ కోసం గదిని అందంగా అలకరించారు. వధూవరులు గదిలోకి వెళ్లాక కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. వరుడు నివాసన్ ఆవేశంతో వధువు సంధ్యను హత్య చేసి అక్కడి నుంచి భయంతో పారిపోయాడు. తెల్లరైనా వారిద్దరు బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు తలుపులు తీసి చూశారు. గదిలో సంధ్య మృతిచెంది ఉండటంతో వారంతా షాక్ గురయ్యారు. వరుడి నివాసన్ కోసం గాలించగా అతడు కూడా ఊరిలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇరువురి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తొలిరాత్రే వారిద్దరి చివరి రాత్రి అవడంపై స్థానికులు అనేకరకాలుగా చర్చించుకుంటున్నారు.