https://oktelugu.com/

ఆగస్టులో గ్రామాలకు సీఎం జగన్..!

అధికారం చేపట్టిన అనంతరం తొలిసారి సీఎం జగన్‌ గ్రామాల్లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు. సీఎంగా కొన్ని ప్రారంభోత్సవాలకు మినహా ఆయన జనంలోకి వెళ్ళ లేదు. ఏడాది పాలన సందర్భంగా జనంలోకి వెళ్లాలనుకున్నా కరోనా కారణంగా సాధ్యం కాకపోవడంతో వీడియో కాన్ఫెరెన్స్ లలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించిన జగన్ ప్రజలకు ఎన్నో హామిలు ఇచ్చారు. ఏడాది అనంతరం ఆగస్టులో ప్రజల్లో వెళ్లి పాలన గురించి వారినే అడిగి తెలుసుకొనున్నారు. అందుకే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 11, 2020 / 07:36 PM IST
    Follow us on


    అధికారం చేపట్టిన అనంతరం తొలిసారి సీఎం జగన్‌ గ్రామాల్లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు. సీఎంగా కొన్ని ప్రారంభోత్సవాలకు మినహా ఆయన జనంలోకి వెళ్ళ లేదు. ఏడాది పాలన సందర్భంగా జనంలోకి వెళ్లాలనుకున్నా కరోనా కారణంగా సాధ్యం కాకపోవడంతో వీడియో కాన్ఫెరెన్స్ లలో పాల్గొన్నారు.

    ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించిన జగన్ ప్రజలకు ఎన్నో హామిలు ఇచ్చారు. ఏడాది అనంతరం ఆగస్టులో ప్రజల్లో వెళ్లి పాలన గురించి వారినే అడిగి తెలుసుకొనున్నారు. అందుకే సంక్షేమ పథకాలను వరుసగా ప్రకటిస్తున్న ఆయన అర్హులకు ప్రభుత్వ పథకాలు తప్పనిసరిగా అందాలని అధికారులను ఆదేశిస్తున్నారు.

    గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలు, విధి విధానాలపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పర్యటనలో ప్రజలు ఎవరూ తమకు సంక్షేమ పథకాలు అందలేదని ఫిర్యాదులు చేయకూడదని, చేయి ఎత్తకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్య రాకుండా ముందే ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు.

    మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలని, ప్రకటించిన సమయంలోగా సకాలంలోనే పథకాలు అందాలని ఆదేశించారు. ఎవరి దరఖాస్తులు కూడా తిరస్కరించ కూడదన్నారు. అర్హత ఉన్నవారికి పథకాలు రాకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. పెన్షన్లు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలన్నారు. మొదట వీటిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.