https://oktelugu.com/

కొడుకు కోసం తుక్కు సామానుతో కారు తయారు చేశాడు.. మహీంద్రా ఓనర్ బంపర్ ఆఫర్

కాదేదీ వాడకపోవడానికి అనర్హం అన్నట్టుగా ఓ వ్యక్తి తుక్కుతో కారునే తయారు చేశాడు. కొడుకు కారు కోరికను ఇలా తీర్చాడు. బైక్ కు అమర్చే ఇంజిన్ తో మహీంద్ర జీపు విడిభాగాలతో ఏకంగా కారును సొంతంగా తయారు చేశాడు.. సృజనాత్మకతకు అంతం లేదంటే ఇదేనేమో.. తమ పాత జీప్ విడిభాగాలతో ఏకంగా కారును తయారు చేసిన వ్యక్తి వీడియోను షేర్ చేసిన ‘ఆనంద్ మహీంద్ర’ ఏకంగా ఆ అద్భుత వాహనాన్ని తనకు ఇస్తే తాను కొత్త ‘బోలెరో’ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2021 / 09:20 PM IST
    Follow us on

    కాదేదీ వాడకపోవడానికి అనర్హం అన్నట్టుగా ఓ వ్యక్తి తుక్కుతో కారునే తయారు చేశాడు. కొడుకు కారు కోరికను ఇలా తీర్చాడు. బైక్ కు అమర్చే ఇంజిన్ తో మహీంద్ర జీపు విడిభాగాలతో ఏకంగా కారును సొంతంగా తయారు చేశాడు.. సృజనాత్మకతకు అంతం లేదంటే ఇదేనేమో..

    తమ పాత జీప్ విడిభాగాలతో ఏకంగా కారును తయారు చేసిన వ్యక్తి వీడియోను షేర్ చేసిన ‘ఆనంద్ మహీంద్ర’ ఏకంగా ఆ అద్భుత వాహనాన్ని తనకు ఇస్తే తాను కొత్త ‘బోలెరో’ వాహనం ఇస్తానని ఆఫర్ చేశాడు. అతడు తుక్కుతో తయారు చేసిన వాహనాన్ని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శనకు ఉంచుతానని.. అది మాలో స్ఫూర్తి నింపుతుందని ట్వీట్ చేశాడు.

    మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా దేవ్ రాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహర్ కంసాలి పనిచేస్తుంటాడు. కొడుక్కి కారు ఎక్కాలని చిన్నప్పటి నుంచి కోరిక. అంత స్థోమత లేకపోవడంతో దత్తాత్రేయనే తుక్కు వాహనాల విడిభాగాలు సేకరించి వాటితో సొంతంగా కారు తయారు చేశాడు. కిక్ ఇస్తే స్టార్ట్ అయ్యేలా దీన్ని తయారు చేశాడు. దత్తాత్రేయ చేసిన వాహనంపై ఎవరో యూట్యూబ్ వీడియో చేస్తే చూసి అబ్బురపడిన ఆనంద్ మహీంద్ర తాజాగా ఆ వాహనం తనకు ఇస్తే కొత్త ‘బొలెరో’ ఇస్తానని.. మన ప్రజల తెలివితేటలు, తక్కువ వనరులతో ఎక్కువ పనిచేసే సామర్థ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేనని అభినందించాడు.

    తుక్కుతో తయారు చేసిన వాహనం ఇదే..