https://oktelugu.com/

Pushpa Collections: పుష్ప కలెక్షన్లు: అసలు వాస్తవాలు ఇవేనా?

Pushpa Collections: అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ విడుదలైంది. సుకుమార్-బన్నీ కాంబినేషన్ పై అంచనాలు భారీగా పెరిగిన వేళ నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు టైం లేక ఆగమాగం విడుదల చేశారు. డిసెంబర్ 17న అతి కష్టం మీద ‘పుష్ప’ మూవీ హిందీతో  సహా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఐదు భాషల్లో భారీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో డెడ్ లైన్స్ పూర్తి చేసుకోవడం సుకుమార్ కు పెద్ద టాస్క్ గా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2021 / 08:55 PM IST

    Pushpa

    Follow us on

    Pushpa Collections: అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ విడుదలైంది. సుకుమార్-బన్నీ కాంబినేషన్ పై అంచనాలు భారీగా పెరిగిన వేళ నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు టైం లేక ఆగమాగం విడుదల చేశారు. డిసెంబర్ 17న అతి కష్టం మీద ‘పుష్ప’ మూవీ హిందీతో  సహా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఐదు భాషల్లో భారీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో డెడ్ లైన్స్ పూర్తి చేసుకోవడం సుకుమార్ కు పెద్ద టాస్క్ గా మారింది.

    ఎట్టకేలకు ఈ చిత్రం విడుదలైనప్పటికీ మిశ్రమ స్పందన వచ్చింది. డిసెంబర్ 17న విడుదల చేయకుండా సుకుమార్ కు కాస్త సమయం ఇస్తే ఈ సినిమా మరింతగా ట్రిమ్ అయ్యి పాజిటివ్ స్పందన వచ్చే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు మిక్స్ డ్ టాక్ రావడంతో వారం రోజుల్లో కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి.

    పుష్ప సినిమాను బ్రేక్ ఈవెన్ లో వచ్చేలా చేసేందుకు టీం తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ అనుకున్న సమాయానికి పనులు జరగడం లేదు. ఏపీలో కలెక్షన్లు 50శాతం కంటే తక్కువ బ్రేక్ ఈవెన్ లో ఉన్నాయి. నైజాంలో సంఖ్య 70 శాతం అంటే బ్రేక్ ఈవెన్ కు మరో 30శాతం అవసరం. మైత్రీ మూవీ మేకర్స్ బ్రాండ్ ఇమేజ్, అనేక చిత్రాలు వీరు నిర్మిస్తుండడంతో బయ్యర్లు పుష్ప ఫలితం విషయంలో టెన్షన్ పడడం లేదు.

    ఇప్పుడు హిందీలో ఒక పెద్ద చిత్రం ‘83’.. తెలుగులో ‘శ్యామ్ సింగరాయ్’ ఈ వారం విడుదలవుతున్నాయి. ఆ రెండు సినిమాలతో ‘పుష్ఫ’ ఖచ్చితంగా పోటీపడాల్సిందే. అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ ‘పుష్ప’కి సహాయం చేస్తుందనే ఆశ ఉంది. అయితే మొత్తానికి వారం రోజుల్లో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుంది? ఆశించిన వసూళ్లను సాధించడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది.

    మరోవైపు అల్లు అర్జున్ తాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించానని మూడ్ లో ఉన్నప్పటికీ మీడియాలో మాత్రం ‘పుష్ప’కు అంత హైప్ రాలేదు. బన్నీని సంతృప్తి పరచడానికి ‘పీఆర్’ టీం తాజాగా రంగంలోకి దిగి కష్టపడుతున్నట్టు తెలుస్తోంది.