Love Tragedy: ఆకర్షణ ఎంతటి వారినైనా పిచ్చివారిని చేస్తోంది. పెళ్లయిందని తెలిసినా ఆమె కోరిక మారలేదు. యువతి తన ప్రేమను (Love) వ్యక్తం చేస్తూనే ఉంది. తనకు ఇద్దరు పిల్లలున్నారని చెప్పినా ఆమెలో ప్రేమ తగ్గలేదు. ఇద్దరిలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కానీ వన్ సైడ్ లవ్. ఆమెకే ఇష్టముంది కానీ అతడికి కావాలని లేదు. వద్దని వారించినా వినలేదు. ఇంకా వేధింపులు పెరిగిపోయాయి. చివరికి ఏం చేయాలో పాలుపోక తన ప్రాణాలు తీసుకోవాలని భావించి ఆత్మహత్యా యత్నం చేశాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన వేముల గణేష్ ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే మండలంలోని తాటిపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పనిచేస్తోంది. రోజు గణేష్ ట్యాక్సీలో రాకపోకలు సాగించే యువతి అతడిపై ఇష్టం పెంచుకుంది. అది కాస్త ప్రేమగా మారింది. కానీ అప్పటికే అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దీంతో వద్దని వారించినా ఆమె వినలేదు. పైగా వేధింపులు ఎక్కువ చేసిది. దీంతో అతడు భరించలేకపోయాడు.
యువతి ప్రవర్తనపై అతడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నువ్వే కావాలంటూ వేధింపులు మొదలు పెట్టింది సినిమాల్లోలాగా ఆమె బాధలు ఎక్కువయ్యాయి. ఏ రోజుకైనా మారకపోతుందా అని ఎదురుచూసినా ఫలితం కనిపించలేదు. తనను కావాలనుకోవడం సమంజసం కాదని చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆమె ప్రవర్తనపై విసిగిపోయాడు. రోజురోజుకు పెరిగిపోతున్న ఆమె కు బుద్ధి చెప్పాలని భావించాడు.
ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే యువతి బారి నుంచి కాపాడాలని విలపిస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతడి ఆత్మహత్య యత్నానికి కారణమైన యువతిపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.