https://oktelugu.com/

మోడీకి పోటీగా మమత బెనర్జీ!

దేశంలో బీజేపీని ఎదుర్కొనే బలమైన ప్రత్యామ్మాయం లేకనే ఇన్నాళ్లు గెలిపిస్తూ వచ్చారన్న విమర్శలు వచ్చాయి. మోడీకి సరితూగగల నేత రాహుల్ గాంధీ ఎప్పటికీ కారని తేలిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నీరుగారిపోవడంతో బీజేపీకి ఎదురేలేకుండాపోయింది. అయితే బెంగాల్ బెబ్బులి గర్జించింది. ఓవైపు మోడీ.. మరోవైపు అమిత్ షా.. ఇంకో వైపు బీజేపీ చెప్పు చేతల్లో ఈసీ పశ్చిమ బెంగాల్ లో మమతను ముప్పుతిప్పలు పెట్టినా కూడా మొక్కవోని పట్టుదలతో మమత బెనర్జీ వారందరినీ ఎన్నికల్లో మట్టి […]

Written By: , Updated On : May 6, 2021 / 02:26 PM IST
Follow us on

దేశంలో బీజేపీని ఎదుర్కొనే బలమైన ప్రత్యామ్మాయం లేకనే ఇన్నాళ్లు గెలిపిస్తూ వచ్చారన్న విమర్శలు వచ్చాయి. మోడీకి సరితూగగల నేత రాహుల్ గాంధీ ఎప్పటికీ కారని తేలిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నీరుగారిపోవడంతో బీజేపీకి ఎదురేలేకుండాపోయింది.

అయితే బెంగాల్ బెబ్బులి గర్జించింది. ఓవైపు మోడీ.. మరోవైపు అమిత్ షా.. ఇంకో వైపు బీజేపీ చెప్పు చేతల్లో ఈసీ పశ్చిమ బెంగాల్ లో మమతను ముప్పుతిప్పలు పెట్టినా కూడా మొక్కవోని పట్టుదలతో మమత బెనర్జీ వారందరినీ ఎన్నికల్లో మట్టి కరిపించారు. దీంతో ఇప్పుడు మోడీకి సరితూగగల నేత మమత బెనర్జీ అంటూ దేశవ్యాప్తంగా పలువురు నాయకులు, మేధావులు అభివర్ణిస్తున్నారు.

యూపీఏలోని కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా మారుతున్న వేళ ఆ పార్టీకి ప్రత్యామ్మాయంగా తృతీయ ఫ్రంట్ అయినా పెట్టాలి లేదంటే.. యూపీఏ అధ్యక్ష పదవిని సోనియా త్యజించి బెంగాల్ సీఎం మమత చేతిలోనైనా పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే మరాఠా నేత శరద్ యాదవ్ తృతీయ కూటమికి మమత నేతృత్వం వహించి బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహించాలని కోరారు.

మోడీ నేతృత్వంలోని బీజేపీకి దేశంలో కాంగ్రెస్ ప్రత్యామ్మాయంగా కనిపించడం లేదు. కాంగ్రెస్ పని రోజురోజుకు తీసికట్టుగా మారుతోంది. పైగా అవినీతి మరకలతో కాంగ్రెస్ ను నమ్మడం లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఓటములు.. సారథ్యంలోపం ఇలా మోడీని ఢీకొట్టే సామర్థ్యం సోనియాకు, రాహుల్ కు లేకుండా పోయాయి.

బెంగాల్ లో మమత బెనర్జీ ఏకంగా మోడీషాలు పట్టుబట్టినా వారిని చిత్తుగా ఓడించారు. బలమైన నేతగా ఫోకస్ అయ్యారు. దీంతో ఇప్పుడు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మమతా బెనర్జీ నాయకత్వానికి అంగీకారం తెలిపే పరిస్థితి వచ్చింది. యూపీఏ చైర్ పర్సన్ గా మమతా బెనర్జీని నియమిస్తే మోడీకి ధిటైన నేత వచ్చారని.. ప్రత్యామ్మాయం ఉందన్న ఆలోచన దేశ ప్రజల్లో కలుగుతుందని మెజార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

మోడీ బీజేపీ ఓటమి దిశగా సాగితే ఇన్నాళ్లు మద్దతుగా ఉన్న టీఆర్ఎస్, వైసీపీ లాంటి పార్టీలు కూడా మమత బెనర్జీ వైపు తిరగగలవు. బీజేపీ సన్నిహిత పార్టీలు మమత కోసం రాగలవు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో విసిగివేసారిన అన్ని రాష్ట్రాల్లోని పార్టీలు ఇప్పుడు మమతను ఆశాకిరణంలా చూస్తున్నాయి. చేయాల్సిందల్లా ఆమె జాతీయ రాజకీయాల్లోకి బలంగా రావడమే.. అలా వస్తే.. ఒకవేళ కాంగ్రెస్ మద్దతిస్తే వచ్చేసారి రాజకీయం రసకందాయంలో పడుతుంది.