
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రకం కరోనా వైరస్ N440K వేరియెంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వార్తలు రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తన్నాయి. కర్నూలు జిల్లాలో నమోదైన ఈ కొత్త రకం వైరస్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. దీని పై ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి మీడియా మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. గత ఏడాది జూన్, జూలైలో ఈ స్ట్రెయిన్ ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు నమూనాలు నుంచి సీసీఎంబీ గుర్తించిందని తెలిపారు. ఏపీలో 2021 ఫిబ్రవరి వరకు కనిపించి క్రమంగా తగ్గింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బి.1.617ను వేరియెంట్ ఆఫ్ ఇంటరెస్ట్ గా ప్రకటించింది. అయితే ఎన్440కే పై ఎలాంటి ప్రస్తావన చేయలేదు అని జవహర్ రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు.