అందరికీ దూరంగా ఉంటున్న సీనియర్ స్టార్ !

రెండేళ్ల క్రితమే సినిమాల నుండి తప్పుకోవాలని ఆసక్తి చూపించిన వెంకటేష్, మళ్ళీ కొన్ని కారణాల వల్ల, అలాగే సురేష్ బాబు ఒత్తిడి వల్ల తప్పక మళ్ళీ సినిమాలు చేయాల్సి వచ్చింది. దాంతో వెంకీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు. అంతలో కరోనా సెకెండ్ వేవ్ వచ్చింది. ఇది ఎప్పటి వరకు ఉంటుందో, మళ్ళీ ఎప్పటికీ షూటింగ్స్ స్టార్ట్ అవుతాయో ఇపుడే చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. దాంతో ఈ ఏడాది తన నుండి రెండు చిత్రాలను విడుదల […]

Written By: admin, Updated On : May 6, 2021 2:39 pm
Follow us on

రెండేళ్ల క్రితమే సినిమాల నుండి తప్పుకోవాలని ఆసక్తి చూపించిన వెంకటేష్, మళ్ళీ కొన్ని కారణాల వల్ల, అలాగే సురేష్ బాబు ఒత్తిడి వల్ల తప్పక మళ్ళీ సినిమాలు చేయాల్సి వచ్చింది. దాంతో వెంకీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు. అంతలో కరోనా సెకెండ్ వేవ్ వచ్చింది. ఇది ఎప్పటి వరకు ఉంటుందో, మళ్ళీ ఎప్పటికీ షూటింగ్స్ స్టార్ట్ అవుతాయో ఇపుడే చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.

దాంతో ఈ ఏడాది తన నుండి రెండు చిత్రాలను విడుదల చేద్దామని ప్లాన్ చేసుకున్న వెంకటేష్ ప్లాన్ పూర్తిగా రివర్స్ అయింది. నిజానికి వెంకీ ఏడాదికి ఒక్క సినిమా కన్నా ఎక్కువుగా చెయ్యకూడదు అనుకున్నాడు. కానీ అనుకోకుండా ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలలో నటించాల్సి వచ్చింది. ఆ మూడు సినిమాలు దృశ్యం 2, ఎఫ్ 3, నారప్ప. విచిత్రంగా ఈ మూడు సినిమాలలో ఒకటి సీక్వెల్ కాగా, రెండు రీమేక్.

అందుకే మూడు సినిమాల పై మంచి అంచనాలు ఉన్నాయి. వెంకీ మార్కెట్ తో సంబంధం లేకుండా బిజినెస్ కూడా బాగా అవుతుంది, అందుకే ఈ చిత్రాల కోసం వెంకీ స్పెషల్ కేర్ తీసుకోక తప్పడం లేదు. ఎలాగూ “దృశ్యం 2”, “నారప్ప” సినిమాలు షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి, ఆ సినిమాల కోసం ఇప్పుడు వెంకీ కొత్త రకం ప్రమోషన్స్ చేయాల్సి వస్తోంది.

జులైలో నారప్పను రిలీజ్ చేయడానికి సురేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోపే వెంకీతో నారప్పకు సంబంధించి కొత్తగా ప్రమోషన్స్ చేయాలని సురేష్ బాబు నారప్ప టీమ్ కి మెసేజ్ లు పాస్ చేశారు. అయితే తన సినిమాని తానే ప్రమోట్ చెయ్యాలంటే వెంకీకి చిరాకు, ఈ ప్రమోషన్స్ విషయంలో ఈ సీనియర్ స్టార్ తర్జన భర్జన పడుతూ ఎవ్వరికీ టచ్ లో లేకుండా అందరికీ దూరంగా ఉంటున్నాడట. పూర్తిగా ఆధ్యాత్మిక చింతనతోనే ఎక్కువగా గడిపేస్తున్నాడట.