Mamata Banerjee : మోడీ అంటే అదీ.. మోడీ అంటే ఇదీ.. మోడీ లేకుంటే దేశం ఎక్కడికో పోయేది.. దేశాభివృద్ధిని మోడీనే అడ్డుకుంటున్నాడు.. మత కల్లోలాలకు మోడీనే కారణం.. ఆదానీ, అంబానీ ఎదుగుదల వెనుక మోడీ ఉన్నారు. పురాతన చరిత్ర ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ ఎవరి మాటలు.. సందేహం అక్కర్లేదు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాటలు. ప్రధాని మోడీని గ్లోబల్ లీడర్ గా ప్రపంచం మెచ్చుకుంటుంటే మమత తిట్టిపోస్తుంది. ప్రధాని మోడీ అంటే ఆమెకు అస్సలు గిట్టదు. కారణం రాజకీయ కోణం. బెంగాళ్ ను కమలంలో కలుపుకునేందుకు ఎప్పటి నుంచో శ్రమిస్తోంది ఎన్డీయే. అక్కడ గతంలో రెండు సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ 2021లో 77 సీట్లను గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. దీంతో సాధారణంగానే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉండబోతోంది. పైగా దీదీ (మమతా బెనర్జీ) కూడా ఇండియా కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తోంది. కాబట్టి మోడీని టార్గెట్ చేయడం కామనే. అయితే బీజేపీ ప్రభుత్వం కూడా 2014 నుంచి దేశ రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకుంటూ వచ్చింది. బంగ్లాదేశ్ తో బెంగాళ్ ఎక్కువ సరిహద్దును పంచుకోవడంతో ఎలాగైనా అక్కడ పాగా వేయాలని ఎన్డీయే సర్కార్ మొదటి నుంచి శ్రమిస్తోంది. కమలాన్ని అడ్డుకునేందుకు దీదీ తీవ్రంగా శ్రమిస్తుండడంతో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం అక్కడ తృణముల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. బంగ్లాదేశ్ అల్లర్లను మమతా బెనర్జీ మోడీకి అంటగడుతుందని ఇండియా కూటమి, లెఫ్ట్ సంబురాలు చేసుకుంది. కానీ ఆమె స్వరం మార్చింది.
దీదీ మోడీకి ఏం కితాబిచ్చింది?
‘బంగ్లాదేశ్ సంక్షోబాన్ని హ్యాండిల్ చేసే విషయంలో ప్రధాని మోడీ అనుసరిస్తున్న తీరు అమోఘం, అద్భుత్వం. ఆయన రణనీతి, ఆయన వ్యూహ చాతుర్యం, ఆయన స్ట్రాటజీ అద్భుత్వం. దీన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నానని నేను, నా ప్రజలు, నా ప్రభుత్వం భారత ప్రభుత్వంతో, మోడీతో కలిసి పని చేస్తాం.’ అన్నారు. ఈ మాటలు ప్రతిపక్షానికి షాక్ ను కలిగించాయి. మమత ఈ సమయంలో ఇలా మాట్లాడడం ఏంటని? ప్రతీ ఒక్కరూ చెవులు కొరుక్కున్నారు. ఈవెన్ పాలక పక్షంలోని చాలా మంది నేతలు (అసలు వ్యూహం తెలియని) కూడా అవాక్కయ్యారు. కానీ దీని వెనుక భయం, ఆందోళన ఉన్నాయని తర్వాత తెలిసింది. అసలేం జరిగింది?
ఎన్డీయే సర్కార్ ఏం చేసింది?
బంగ్లాదేశ్ లో పరిస్థితులు దిగజారుతున్న విషయాన్ని భారత ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ ముందే గమనించారు. అక్కడి ప్రధాని షేక్ హసీనాను హెచ్చరించారు. కానీ ఆమె పట్టించుకోలేదు.. ఇది వేరే విషయం.. అసలు మమత మోడీ వెన్నంటి ఉంటాననడంలో ఆంతర్యం ఏంటి?
బంగ్లాదేశ్ సంక్షోభం గురించి ముందే తెలిసిన మోడీ ప్రభుత్వం అవామీలీగ్ పార్టీకి చెందిన గత ప్రధాని షేక్ హసీనాను రక్షించి ఢిల్లీలో ఉంచింది. మోడీ ఎందుకు హసీనాను రక్షించారు. మోడీ యుద్ధ చతురత ఏంటి? తదితరాలను అంచనా వేసిన మమత స్వరం మార్చింది.
దీంతో పాటు బంగ్లాదేశ్ తో ఎక్కువ బార్డర్ ను పంచుకున్న బెంగాళ్ ను ఏలుతున్నది మమతా బెనర్జీ. పొరుగు రాష్ట్రం సంక్షోభంలో ఉన్న సమయంలో ఏవైనా అవాకులు, చెవాకులు మాట్లాడి రాష్ట్ర ప్రజలను గందరగోళానికి, ఉద్యమాలకు రెచ్చగొడితే భారీగా నష్టపోతారని హెచ్చరించినట్లు తెలుస్తుంది.
బంగ్లాలో అల్లర్లు, పొరుగున్న ఉన్న బెంగాళ్ లో కూడా చెలరేగితే అణచివేయడం భారత్ కు చిటికెలో పనే.. కానీ భారీగా ప్రాణనష్టం జరిగితే మాత్రం ప్రభుత్వం బాధపడుతుంది. కాబట్టి మోడీ ప్రభుత్వం మమతకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అందుకే మమత సైలెంట్ గా ఉండడంతో పాటు మోడీ, ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు.
చేస్తే ఏమయ్యేది?
మమతా బెనర్జీ మోడీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తే ఎక్కువ మంది రోహింగ్యాలు ఉన్న బెంగాల్ లో నివురు గప్పిన నిప్పులా ఉన్న అల్లర్లు బయటకు వస్తాయి. పొరుగున ఉన్న బంగ్లా, బెంగాళ్ రెండు కలిస్తే సంక్షోభం మరింత పెరుగుతుంది. ఒక వేళ అదే జరిగితే.. అక్కడ రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం వస్తుంది. ఇదే అదునుగా బెంగాళ్ ను రెండుగా విభజించే ఛాన్స్ కూడా లేకపోలేదు.
ఇందులో ఉత్తర బెంగాళ్ ను ఒక యూనియన్ టెరిటరీగా చేస్తే సిలువుడి చెక్ సమీపంలోని ప్రాంతాలను కాపాడుకునే వీలుంటుంది కాబట్టి విడగొట్టడం తప్పనిసరి అవుతుంది. దీని ద్వారా అటు బంగ్లాదేశ్, ఇటు చైనా, పాక్ నుంచి దాడులు జరగకుండా పూర్తిగా భారత ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందని హెచ్చరికలు వెళ్లాయి.
దీంతో మమతాకు ఎలాంటి ఆఫ్షన్ లేకుండా పోయింది. పొరుగు దేశంలో అల్లర్లు జరుగుతున్న సమయంలో సమీపంలో కొంచెం సెగ ఉంటుంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఇక్కడ కూడా అల్లర్లు జరిగితే.. ఇక మమత ప్రభుత్వం ఉండదు.. రాష్ట్రం కూడా ఇలా ఉండదని హెచ్చరికల నేపథ్యంలో మమత స్వరం మార్చాల్సి వచ్చింది.