రాహుల్ సారధ్యం.. మమతా సంసిద్ధం

దేశంలో మూడో కూటమి ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. విపక్షాలు ఏకం అయ్యేందుకు సంసిద్ధమవుతున్నాయి. బీజేపీయేత ప్రభుత్వం రావడానికి అన్ని పార్టీలు కలిసి నడవాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నాయి. ఇప్పటికి బీజేపీలో వ్యతిరేకత అంతగా లేకపోవడంతో ప్రతిపక్షాల్లో కాస్త విశ్వాసం సన్నగిల్లినా పట్టుబట్టి మరీ గమ్యం చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. నరేంద్రమోడీని ఢీకొట్టాలంటే దానికి చాలా బలం కావాలని భావిస్తున్నాయి. కేంద్రంలో బలమైన శక్తిగా ఉన్న బీజేపీకి ఇప్పట్లో బలం తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీంతో విపక్షాలు […]

Written By: Srinivas, Updated On : July 29, 2021 12:17 pm
Follow us on

దేశంలో మూడో కూటమి ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. విపక్షాలు ఏకం అయ్యేందుకు సంసిద్ధమవుతున్నాయి. బీజేపీయేత ప్రభుత్వం రావడానికి అన్ని పార్టీలు కలిసి నడవాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నాయి. ఇప్పటికి బీజేపీలో వ్యతిరేకత అంతగా లేకపోవడంతో ప్రతిపక్షాల్లో కాస్త విశ్వాసం సన్నగిల్లినా పట్టుబట్టి మరీ గమ్యం చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. నరేంద్రమోడీని ఢీకొట్టాలంటే దానికి చాలా బలం కావాలని భావిస్తున్నాయి.

కేంద్రంలో బలమైన శక్తిగా ఉన్న బీజేపీకి ఇప్పట్లో బలం తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీంతో విపక్షాలు తమ పంథా మార్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ప్రధాన మంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రకటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఇక విపక్షాలు ఏకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీయేతర కూటమి కోసం దారులు పడుతున్నట్లు తెలుస్తోంది.

థర్డ్ ఫ్రంట్ కు ఎవరు నేతృత్వం వహించినా తుది లక్ష్యం ఒక్కటే. బీజేపీని గద్దె దింపడమే కావాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ సారధ్యంలో నడిచేందుకు ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే శరద్ పవార్ తో సమావేశమైన నేతలు అంతా కూడా రాహుల్ కు బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా తీసుకోవడానికి నిర్ణయించారు.

ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలతో కాంగ్రెస్ పార్టీలో పలు మార్పులు వస్తున్నాయి. విపక్షాలు కూడా కాంగ్రెస్ తో నడిచేందుకు సిద్ధం అంటున్నాయి. ఈ నేపథ్యంలో మూడో కూటమి సాధ్యం కాదని రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అయితేనే తాను కాంగ్రెస్ కోసం పనిచేస్తానని పీకే ఇదివరకే ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కీలక మలుపులు తిరుగుతున్నాయి.