Samsung Galaxy Z Flip 8: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో Samsung తన తదుపరి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ Galaxy Z Flip 8ను జూలైలో జరిగే Galaxy Unpacked ఈవెంట్‌లో ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు లీకులు చెబుతున్నాయి. ఈసారి ఫోన్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఒకే మోడల్‌ను రెండు వేర్వేరు ప్రాసెసర్లు కనిపిస్తాయి. అలాగే ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ ప్రాసెసర్లు.. ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
Samsung Galaxy Z Flip 8 కొన్ని మార్కెట్లలో శాంసంగ్ సొంత Exynos 2600 చిప్‌తో, మరికొన్ని దేశాల్లో Snapdragon 8 Elite Gen 5 for Galaxy ప్రాసెసర్‌తో అందుబాటులోకి రావచ్చు. గత ఏడాది వచ్చిన Galaxy Z Flip 7 పూర్తిగా Exynos 2500 చిప్‌తోనే విడుదల కాగా.. ఈసారి కంపెనీ మళ్లీ రెండు చిప్‌సెట్ వ్యూహాన్ని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొన్ని నివేదికల ప్రకారం Exynos 2600 తయారీ వ్యయం ఎక్కువగా ఉండటం.. మరోవైపు Qualcomm తన ఫ్లాగ్‌షిప్ చిప్‌కు అనుకూల ధరలు ఆఫర్ చేయడం వల్ల శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో Snapdragon, మరికొన్ని ప్రాంతాల్లో Exynos వేరియంట్లను విక్రయించే అవకాశం ఉంది.
భారత్, యూరప్, దక్షిణ కొరియా వంటి మార్కెట్లలో Exynos 2600 వేరియంట్ వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా, కెనడా, చైనా, జపాన్ వంటి దేశాల్లో Snapdragon వేరియంట్ అందుబాటులోకి రావచ్చని సమాచారం. అయితే దీనిపై శాంసంగ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Exynos 2600 ప్రపంచంలోనే తొలి 2 నానోమీటర్ (2nm) ప్రాసెస్ టెక్నాలజీతో తయారైన మొబైల్ చిప్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో 10 కోర్ CPU, మెరుగైన AI సామర్థ్యాలు, అధునాతన GPU, మెరుగైన పవర్ ఎఫిషియెన్సీ వంటి ఫీచర్లు ఉంటాయని శాంసంగ్ చెబుతోంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, AI ఆధారిత పనితీరులో ఇది గణనీయమైన మెరుగుదల అందించగలదని భావిస్తున్నారు.
Galaxy Z Flip 8 డిజైన్ పరంగా Flip 7ను పోలి ఉండే అవకాశం ఉంది. అయితే కొత్త హింజ్ డిజైన్, తక్కువగా కనిపించే స్క్రీన్ క్రీజ్, మరింత సన్నగా ఉండే బాడీ, తక్కువ బరువు వంటి చిన్నచిన్న మెరుగుదలలు ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లలో క్రీజ్ సమస్యను తగ్గించడంపై శాంసంగ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ Galaxy Z Flip 8లో 6.9 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండొచ్చని అంటున్నారు. సుమారు 4.1 అంగుళాల కవర్ స్క్రీన్ ఉండొచ్చు. కెమెరా విభాగంలో 50MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 10MP సెల్ఫీ కెమెరా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 4,300mAh బ్యాటరీ ఉండగా.. 25W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని సమాచారం. Android 16 ఆధారిత One UIతో పాటు Galaxy AI ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను కూడా శాంసంగ్ అందించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
