Jana Sena: పెద్దల సభకు సంబంధించి అభ్యర్థి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్రం నుంచి తనకు లభించిన అవకాశానికి తగ్గట్టుగా జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో మూడు స్థానాలు టిడిపి అభ్యర్థుల కోసం ఖరారు చేశారు. ఒక స్థానాన్ని టిడిపికి కేటాయించారు
రమేష్, పవన్ కళ్యాణ్ కు మధ్య బలమైన బంధం ఉంది. 2015 నుంచి వీరు స్నేహితులుగా కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే రమేష్ కు విపరీతమైన అభిమానం. 2019లో జనసేనకు ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ.. ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రమేష్ వెనకడుగు వేయలేదు. సహనంతో నిలిచారు. పైగా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. తన వెంట ప్రయాణించిన రమేష్ కు ఇప్పుడు ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గౌరవం కల్పించారు..
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ, పెళ్లి సుభాష్ చంద్ర బోస్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. కూటమి అధికరణలతో వచ్చిన తర్వాత సానా సతీష్ బాబు, టిడిపి తరఫున పెద్దల సభకు ఎంపికయ్యారు. ఈ నలుగురి పదవి కాలం పూర్తికావస్తోంది. అందువల్లే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నాలుగు సీట్లలో టిడిపి కి మూడు, జనసేనకు ఒక స్థానం లభించాయి.
జనసేన నుంచి రమేష్ రేపు నామినేషన్ దాఖలు చేస్తారు. టిడిపి నుంచి ఆ ముగ్గురు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.. రేపు లేదా ఎల్లుండి టిడిపి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అనుదిన సమాచారం ప్రకారం కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, చింతకాయల విజయ్, సాన సతీష్, రాజేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, భాష్యం రామకృష్ణ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. టిడిపి అధినేత ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
