కలకత్తా హైకోర్టు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా విధించింది. దీనికి కారణం ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తున్న న్యాయమూర్తికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించడమే. ముఖ్యమంత్రి తీరు కచ్చితంగా కోర్టులకు ఉద్దేశాలు ఆపాదించడమే అని భావించారు. దీంతో న్యాయమూర్తి ఆమెకు రూ.ఐదు లక్షల జరిమానా విధించారు.
ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు,హైకోర్టు న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదిస్తూ లేఖలు రాసినా ఆయనపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకాడినట్లు అనే విమర్శలు వస్తున్నాయి. మమతా బెనర్జీపై జరిమానా విధించిన హైకోర్టు జగన్ విషయంలో మాత్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
జగన్ విషయంలో ఎందుకంత ప్రేమ అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వినిపిస్తోంది. సీఎం జగన్ ఆధారాలు లేని ఆరోపణలతో అప్పటి చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. పైగా దాన్ని మీడియాకు విడుదల చేశారు. దీనిపై పెద్ద రగడ కొనసాగింది. న్యాయమూర్తులనే టార్గెట్ చేస్తూ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభియోగాలు చేశారని ఆరోపణలు వచ్చాయి.
న్యాయవ్యవస్థనే బ్లాక్ మెయిల్ చేసిన జగన్ కు ఎలాంటి జరిమానాలు పడలేదు. పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నా కోర్టుల నుంచి ఏ ఇబ్బంది రాలేదు. కానీ చీఫ్ జస్టిస్ పై లేఖలు రాసిన కేసు మాత్రం విచారణలో ఉంది. దీంట్లో విచారణకు సమయం కావాలని కోరుతున్నారు. కానీ మమతా బెనర్జీ విషయంలో చురుగ్గా స్పందించిన న్యాయవ్యవస్థ జనగ్ విషయంలో ఎందుకు స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.