జగన్ ప్రభుత్వంతో పవన్ కు గొడవే?

వకీల్ సాబ్ సినిమా విడుదలైనపుడు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్ల విషయమై పెద్ద దుమారమే రేగింది. కొత్త సినిమాల విషయంలో రేట్లు పెంచి అమ్మడం, అదనపు షోలు వేసుకోవడం మామూలే. మరి ఏ సినిమాకు లేని నిబంధనలు వకీల్ సాబ్ సినిమాకు తీసుకొచ్చారు. థియేటర్ల మీద దాడులు చేసి రూ.10,20లకే టికెట్లు అమ్ముకునేలా నిబంధన తీసుకురావడంతో యాజమాన్యాలకు ఆవేదన కలిగించింది. దీంతో వకీల్ సాబ్ సినిమాపై పెద్ద ప్రభావమే చూపింది. నిర్మాతకు నష్టాన్నే మిగిల్చింది. పవన్ కల్యాణ్ […]

Written By: Raghava Rao Gara, Updated On : July 7, 2021 6:59 pm
Follow us on

వకీల్ సాబ్ సినిమా విడుదలైనపుడు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్ల విషయమై పెద్ద దుమారమే రేగింది. కొత్త సినిమాల విషయంలో రేట్లు పెంచి అమ్మడం, అదనపు షోలు వేసుకోవడం మామూలే. మరి ఏ సినిమాకు లేని నిబంధనలు వకీల్ సాబ్ సినిమాకు తీసుకొచ్చారు. థియేటర్ల మీద దాడులు చేసి రూ.10,20లకే టికెట్లు అమ్ముకునేలా నిబంధన తీసుకురావడంతో యాజమాన్యాలకు ఆవేదన కలిగించింది. దీంతో వకీల్ సాబ్ సినిమాపై పెద్ద ప్రభావమే చూపింది. నిర్మాతకు నష్టాన్నే మిగిల్చింది.

పవన్ కల్యాణ్ సినిమా కాబట్టే ఇంత పట్టుబట్టి మరీ నియంత్రణ చేశారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పై ఉన్నదురుద్దేశంతోనే సర్కారు ఈ విధమైనచర్యలకు పూనుకోవడం సముచితం కాదనే విమర్శలు అప్పుడే వ్యక్తమవయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లకు సంబంధించి కొత్త జీవో తీసుకురావడం వెనుక ఆంతర్యమేమిటో అర్తం కావడంలేదు.

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో కొత్త టికెట్ల రేట్ల విషయంపై ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. కొత్త నిబంధన ప్రకారం నిర్మాత విన్నపాన్ని బట్టి సినిమా రేట్లను పెంచుకునే విధంగా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందనే తెలుస్తోంది. సినిమా స్థాయిని బట్టి టికెట్ల రేట్లు పెంచుకుంటే నిర్మాతకు చాన్స్ ఇస్తారనే విషయం ప్రస్పుటమవుతోంది. నిర్మాత ప్రభుత్వం దగ్గర లాబీయింగ్ చేసుకుని నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలుస్తోంది.

దీంతో పవన్ కల్యాణ్ సినిమా విడుదలైనా తమ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి టికెట్ల రేట్లు పెంచుకోవాలనే విధంగా జీవో ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే సినిమాలపై పవన్ కల్యాణ్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారోనని అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై ఇప్పటికే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యక్తిగత దురుద్దేశాలతో జీవోలు విడుదల చేయడం సముచితంగా లేదని సినీవర్గాలు చెబతున్నాయి.