Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడానికి మమతా బెనర్జీ వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. చివరికి ఓటర్లకు డబ్బులు పంచేందుకు కూడా వెనకాడ లేదు. బెంగాల్ రాష్ట్రంలో ఓటర్లకు డబ్బులు పంచే సంస్కృతి అంతగా ఉండదు. కానీ ఈసారి మమతా బెనర్జీ ఆ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా నందిగ్రామ్ ప్రాంతంలో పోటీ చేస్తున్న సుబేందు అధికారిని ఓడించేందుకు ఆమె అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఏకంగా 100 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
మమతా బెనర్జీ ఈ స్థాయిలో ఖర్చుపెట్టిన విషయాన్ని ఆమ్ జనతా ఉనయన్ పార్టీ అధినేత ఉమాయిబ్ బయటపెట్టారు.. ఈయన గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో పనిచేసేవారు. ఎన్నికలకు ముందు మమతా బెనర్జీతో పొసగక బయటికి వచ్చేసారు. నందిగ్రామ్ లో షాహిద్ ఉల్ హక్ అనే అభ్యర్థిని తన పార్టీ తరఫున పోటీలో ఉంచారు. అయితే ఇక్కడ అధికారి విజయం సాధించారు. నందిగ్రామ్ లో సుభేందు అధికారిని ఓడించేందుకు మమత ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో.. అన్ని రకాలుగా చేసింది. కానీ అవి అంతగా పని చేయలేదు. అందువల్లే ఇక్కడ సుబేందు అధికారి విజయం సాధించారు.
ఈ 100 కోట్లు కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చాయని ఉమాయిబ్ చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా మమతా బెనర్జీ వ్యవహరించారని.. సుబేందు అధికారిని ఓడించేందుకు ఏకంగా 100 కోట్ల వరకు ఖర్చు పెట్టారంటే.. మిగతా నియోజకవర్గాలలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఓటర్లకు 1000 నుంచి 5000 వరకు కవర్లో పెట్టి ఇచ్చారని.. అయితే మమత బెనర్జీ అరాచకాలు తెలిసి ఓటర్లు తెలివిగా నిర్ణయం తీసుకున్నారని ఉమాయిబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై ఇంతవరకు తృణమూల్ కాంగ్రెస్ అవును అని గాని.. కాదు అని గాని.. చెప్పలేదు. ఒకవేళ ఇది గనుక నిజమని తేలితే.. అప్పుడు పరిణామాలు వేరే విధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే బెంగాల్ రాష్ట్రంలో టిఎంసి తీవ్రమైన ప్రతిఘటన ప్రజల నుంచి ఎదుర్కొంటున్నది. ఆ పార్టీ నాయకులు బెంగాల్ నుంచి పారిపోతున్నారు. పార్టీ కార్యాలయాలు తాళం వేసి ఉంటున్నాయి. మమత బెనర్జీ కూడా కార్యకర్తలకు అంతగా అందుబాటులో ఉండడం లేదు.
