Malka Komuraiah
Malka Komuraiah : కొమురయ్య పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ గా సుపరిచితులు. వేలాదిమందికి విద్యార్థులకు విద్యా దానం చేసిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు.. అందువల్లే ఆయన కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. కాగా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది. ఎన్నికల కౌంటింగ్ మార్చి మూడు నమోదు అయింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతోంది.. అయితే ఇందులో రెండు స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. వాటి విజేతలు ఎవరనేది పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. దీనికి సంబంధించి అధికారికంగా విజేతలను వెల్లడించాల్సి ఉంది. కౌంటింగ్ రాత్రి పొద్దు పోయేసరికి కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తొలిసారి బిజెపి అభ్యర్థి విజయం సాధించడం విశేషం. బిజెపి అభ్యర్థి కొమురయ్యకు 12,959 ఓట్లు లభించాయి.. మ్యాజిక్ ఫిగర్ 12,081 ఓట్లు కాగా, వాటిని కొమురయ్య సులువుగా దాటారు. ఇక ఎన్నికల్లో వంగ మహేందర్ రెడ్డి బరిలో నిలువగా.. ఆయనకు 7182 ఓట్లు లభించాయి. అశోక్ కుమార్కు 2621, ప్రభుత్వం రెడ్డి కి 428 ఓట్లు వచ్చాయి. ఇక నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపును సొంతం చేసుకున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆయన మ్యాజిక్ ఫిగర్ 11,800 ఓట్లను ఎప్పుడో దాటేశారు.
Also Read : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల లిస్టు ఎలావుంది?
ఇదీ కొమురయ్య నేపథ్యం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన కొమురయ్య 1959 అక్టోబర్ 1న పెద్దపల్లి జిల్లా బంధం పల్లి లో జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1983లో శాలివాహన గ్రూప్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇక గత పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి తరఫున మల్కాజ్ గిరి స్థానంలో టికెట్ ఆశించారు. ఇక టిపియూఎస్ అభ్యర్థిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు బిజెపి మద్దతు పలికింది. బిజెపి అగ్ర నాయకులు కొమురయ్యకు అనుకూలంగా ప్రచారం చేశారు. దీంతో ఆయన ఘనవిజయం సాధించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి బిజెపి బోణి కొట్టడం విశేషం. కొమురయ్య విజయం సాధించిన నేపథ్యంలో బిజెపి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చిన కొమరయ్యకు స్వీట్లు తినిపించి అభినందనలు తెలియజేశారు.. బిజెపి రాష్ట్ర నాయకత్వం కొమురయ్యకు శుభాకాంక్షలు తెలిపింది.
Also Read : రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనలో బీజేపీ భారీ స్కెచ్.. చివరివరకూ సస్పెన్సే