బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్ట్ బయటకు వచ్చింది. అందరికంటే ముందుగా ఈసారి బీజేపీ రంగంలోకి దిగింది. పోయినసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 10 రోజుల తర్వాత లిస్ట్ బయటకు వస్తే ఈసారి 15 రోజుల ముందుగానే లిస్ట్ బయటకు వచ్చింది.
ఈనెల 13 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు అని అంటున్నారు. తెలంగాణలో 9 సీట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది బీజేపీకి ఎంతో అడ్వంటేజ్ కానుంది. ఈ 9 సీట్లపై పెద్దగా ఎవరికీ అభ్యంతరం లేదు. ఒక్క మల్కాజిరి తప్ప మిగతా వాటిపై వివాదాలు లేవు. ప్రజలు దీన్ని ఓన్ చేసుకున్నారు.
మల్కాజిగిరిపై బీజేపీ స్ట్రాటజీ కరెక్ట్. 10-15 రోజుల తర్వాత మల్కాజిగిరి ప్రకటించి ఉన్నట్టే వివాదాలు పెరిగేవి. అందుకే ఇప్పుడే ప్రకటించడం వల్ల ప్రజల్లో ఒకరకమైన భావన నెలకొంది. ఈటల రాజేందర్ ఉన్న వాటిల్లో బెటర్ అని చెప్పొచ్చు. మురళీధర్ రావు మల్కాజిగిరి ఆశించినా ఆయనకు ఇవ్వలేదు.
గెలిచే స్థానాలను ముందుగా ప్రకటించారని చెప్పొచ్చు. ఇంకా బయటకు రావాల్సినవి ఉన్నాయి. ఈసారి తెలంగాణ చాలా స్పష్టంగా ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీనే ఉంది. బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు.
కాంగ్రెస్ బలం చూస్తే ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ లలో బలంగా ఉంది. పెద్దపల్లిలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయి. బీజేపీకి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఇంకో 3 బీజేపీ గెలుస్తుందన్నది అంచనా.. హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ వేవ్ వచ్చింది. ఇది లోక్ సభకు టర్న్ అయిపోయి బీజేపీకి అనుకూలంగా మారొచ్చు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లలో బీజేపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల లిస్టు ఎలా వుంది? దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
