https://oktelugu.com/

BJP Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనలో బీజేపీ భారీ స్కెచ్.. చివరివరకూ సస్పెన్సే

BJP Presidential Candidate: గత రాష్ట్రపతి ఎన్నికలు గుర్తున్నాయి కదూ.. అప్పట్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉండి… బయట నుంచి చాలా రాజకీయ పక్షాలు మద్దతిచ్చాయి. కానీ అభ్యర్థి ఎవరనేది చివరి నిమిషం వరకూ పెద్దన్న బీజేపీ ప్రకటించలేదు. కొద్దిరోజులు నాన్చి.. ఎన్నికలు సమీప దూరానికి వచ్చేసరికి రామ్ నాథ్ కోవింద్ ను అనూహ్యంగా తెరపైకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కేవలం కమలనాథులకు సుపరిచితమైన కోవింద్ పేరు దక్షిణాది రాష్ట్రాల వారికి మాత్రం అప్పటివరకూ తెలియదు. […]

Written By:
  • Dharma
  • , Updated On : June 17, 2022 / 10:45 AM IST
    Follow us on

    BJP Presidential Candidate: గత రాష్ట్రపతి ఎన్నికలు గుర్తున్నాయి కదూ.. అప్పట్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉండి… బయట నుంచి చాలా రాజకీయ పక్షాలు మద్దతిచ్చాయి. కానీ అభ్యర్థి ఎవరనేది చివరి నిమిషం వరకూ పెద్దన్న బీజేపీ ప్రకటించలేదు. కొద్దిరోజులు నాన్చి.. ఎన్నికలు సమీప దూరానికి వచ్చేసరికి రామ్ నాథ్ కోవింద్ ను అనూహ్యంగా తెరపైకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కేవలం కమలనాథులకు సుపరిచితమైన కోవింద్ పేరు దక్షిణాది రాష్ట్రాల వారికి మాత్రం అప్పటివరకూ తెలియదు. బిహార్ గవర్నర్ గా ఉన్న కోవింద్ ను ఏకంగా రాష్ట్రపతి పీఠం పై కూర్చోబెట్టే వరకూ బీజేపీ పెద్దలు చాలా గోప్యత పాటించారు. తాజా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిపై భార‌తీయ జ‌న‌తా పార్టీ బోలెడంత స‌స్పెన్స్ ను మెయింటెయిన్ చేస్తూ ఉంది. ఈ స‌స్పెన్స్ అనంత‌రం బీజేపీ ఒక స‌ర్ ప్రైజ్ ప్ర‌క‌ట‌న‌తో కొత్త రాష్ట్ర‌ప‌తిని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కు పంపే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. గత అనుభవాల నేపథ్యంలో అందరిలోనూ ఇదే చర్చ నడుస్తోంది. అటు విపక్షాలన్ని ఐక్య కూటమి అభ్యర్థి ప్రకటనకు సన్నాహాలు చేస్తుండగా.. బీజేపీ మాత్రం గోప్యత పాటిస్తోంది. అయితే ఇప్పటికే మోదీ, షా ద్వయం రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసుకుంటాయన్న టాక్ నడుస్తోంది. కానీ ఎక్కడా పేరు లీకు కాకపోవడం వెనుక బీజేపీ పెద్ద స్కెచ్ నడుపుతోంది.

    modi , amit shah, nadda

    గ‌త ప‌ర్యాయం రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తూ కూడా బీజేపీ చాలా మందిని ఆశ్చ‌ర్య ప‌రిచింది. మ‌రీ క‌మ‌లం పార్టీ రాజ‌కీయాల‌ను చాలా క్లోజ్ గా ఫాలో అయ్యే వారికి త‌ప్ప… సౌతిండియాలో రామ్ నాథ్ కోవింద్ గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. అప్పటికే బీజేపీకి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని గెలిపించుకునే అవ‌కాశాలున్నాయ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే అయిన‌ప్ప‌టికీ.. కోవింద్ అభ్య‌ర్థిత్వం మాత్రం ఒక విధంగా చెప్పాలంటే స‌ర్ ప్రైజే.

    Also Read: Bendapudi Students: వారంతా ఫెయిలయ్యారా? బెండపూడి విద్యార్థులపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?

    బ‌హుశా అలాంటి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌, ఊహ‌కు అంద‌ని అభ్య‌ర్థిత్వ ప్ర‌క‌ట‌నే ఈ సారి కూడా బీజేపీ వైపు నుంచి ఉండ‌వ‌చ్చ‌నే అభిప్రాయాలు ఏర్ప‌డుతున్నాయి. అయితే ఇప్ప‌టికే ప‌లు పేర్లు చ‌ర్చ‌లో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల‌కు కేంద్రంలోని మోడీ స‌ర్కారు నియ‌మించిన ప‌లువురు గ‌వ‌ర్న‌ర్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

    modi

    రాష్ట్రపతి అభ్యర్థుల జాబితాలో తెలంగాణ గవర్నర్ త‌మిళిసై ముందు వరుసలో నిలిచారు. ఇలా నోటిఫికేషన్ వచ్చిందో లేదో ఆమె పేరు చక్కర్లు కొట్టింది. ద్రౌప‌ది ముర్మూ కూడా ప్రముఖంగా వినిపించింది. ప్రధానంగా దక్షిణాది కోట, ఎస్టీ కోటా, ముస్లిం.. ఇలాంటి రిజ‌ర్వేష‌న్లే విశ్లేష‌ణ‌ల‌న్నీ తెరపైకి వస్తున్నాయి. కానీ అభ్యర్థి ఎవరనేది అంతు చిక్కడం లేదు. కనీసం బీజేపీ నాయకుల నుంచి పలాన వ్యక్తి అభ్యర్థి అని మాట కూడా తూలడం లేదు.

    కేవలం అట బొగట్టా తప్పించి ఎవరనేది స్పష్టత లేదు. ఈ సారి సౌత్ వ్య‌క్తికి రాష్ట్ర‌ప‌తిగా అవ‌కాశం ఇవ్వాల‌నుకుంటే త‌మిళి సై కు అవకాశం ద‌క్క‌వ‌చ్చ‌ని, ముస్లింకు ఇవ్వాల‌నుకుంటే కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ కు, ఎస్టీకి అనుకుంటే ముర్మూకూ అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌నే విశ్లేష‌ణ‌లున్నాయి. ఇక ద‌శాబ్దాలుగా బీజేపీ మైనారిటీ విభాగం అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న ముక్తార్ అబ్బాస్ న‌క్వీ పేరు కూడా వినిపిస్తోంది.అయితే ఇలాంటి పేర్లు వినిపించ‌డంలో వింత లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాలకే బీజేపీ ఈ విష‌యంలో ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌నుంద‌నే స్ప‌ష్టం అవుతుండ‌టం వ‌ల్ల వినిపిస్తున్న పేర్లు మాత్ర‌మే ఇవి.ఇవే వ‌ర్గాల నుంచి ఊహించ‌ని పేరును ఆఖ‌రి నిమిషంలో బీజేపీ ప్ర‌క‌టించే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని స్ప‌ష్టం అవుతోంది. కోవింద్ ను ఎంపిక చేసిన త‌ర‌హాలో.. ఈ సారి కూడా ఎంపిక ఉండ‌వ‌చ్చు కూడా!

    Also Read:YCP Gadapa Gadapa Program: గడప వరకూ ఎందుకు? గ్రామాల్లోకీ రావొద్దు… వైసీపీ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్న జనం

    Tags