Paradise : నాని (Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల (Sriknath Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ (Paradaise) సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందే దసర (Dasara) అనే సినిమా రావడంతో ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రతి ప్రేక్షకుడిలో ఒక క్యూరియాసిటీ అయితే రేకెత్తిస్తుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అంటూ నాని అభిమానులు చాలా వరకు కొన్ని కామెంట్లైతే చేస్తూ వచ్చారు. ఇక ఎట్టకేలకు ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా గ్లిమ్స్ అయితే భారీ లెవెల్లో ఉండడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా ఆయన చేతి మీద ఉన్న టాటూ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి తెలియజేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ఏరియాలో ఇక వెనకబడిన తెగవారిని బానిస గా మార్చుకొని అగ్రవర్ణాల వారు రాజ్యాన్ని ఏలుతూ తక్కువ జాతి స్త్రీల మాన ప్రాణాలను తీస్తున్న క్రమంలో ఆ పోరాటంలో నుంచి పుట్టిన యోధుడే నాని…
Also Read : జడ వేసి.. హీరో నానినే చూపించలేదే.. ‘ప్యారడైజ్’లో శ్రీకాంత్ ఓదెల స్ట్రాటజీ ఏంటి.?
ఇక తన తల్లి కూడా అగ్రవర్ణాల అరాచకాలకు బలై కొడుకుని యుద్ధానికి వెళ్లే ఒక యోధుడిలా పెంచుతుంది. అందువల్లే ఆయన వాళ్ళ జాతిని ఉద్ధరించడానికి వచ్చిన నాయకుడిగా ఆ జనానికి కనిపించడం వాళ్లందరూ ఆయన బాటలో నడవడం చివరికి తక్కువ జాతి వాళ్లను అంతం చేయాలనుకున్న అగ్రవర్ణాల వారిని ఎలా ఎదిరించి తిరగబడి నిలబడ్డారనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాని తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించబోతున్నారు అనేది గ్లిమ్స్ లో వచ్చిన వాయిస్ ఓవర్ ని బట్టి చూస్తే తెలుస్తోంది. ఇక నాని గెటప్ మాత్రం పొడుగు జడలతో చాలా కొత్త గా ఉంది. అయితే ఆ జడలకి కారణం అక్కడి ఏరియాలో ఉన్న గ్రామ దేవతకి సాక్ష్యంగా ఆయన అలా జడలు వేసుకుంటాడట… ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో నాని నెక్స్ట్ లెవెల్లో విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.
ఇక శ్రీకాంత్ ఓదెల సైతం తన రెండోవ సినిమాని భారీ హిట్టుగా నిలిపి చిరంజీవితో సినిమా చేయడానికి ముందే తను స్టార్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక మొత్తానికైతే ఈ సినిమా 2026 వ సంవత్సరం మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది… మరి నాని విశ్వరూపాన్ని చూపిస్తాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
Also Read : ‘కడుపు మండిన కాకుల కథ’..దుమ్ములేపిన నాని ‘ది ప్యారడైజ్’ టీజర్..కానీ అవేమి బూతులు సామీ!