4 Day Work Week: ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఉద్యోగం చేయని వాడిని హీనంగా చూడటం తెలిసిందే. ఉద్యోగులపై పని భారం పెరుగుతోంది. ఫలితంగా విశ్రాంతికే ఎక్కువ మొగ్గు చూపే వారున్నారు. రోజుకు పన్నెండు గంటలు పనిచేసినా కొన్ని సంస్థలు ఏదో కోల్పోతున్నట్లు ఫీలవడం చూస్తూనే ఉంటాం. ఇటీవల పనిభారం ఎక్కువవుతోంది. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. ఇంత పని చేసినా తగిన గుర్తింపు లేదని నిట్టూర్చే వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఉద్యోగం కత్తి మీద సాముగానే మారుతోంది.

ఈ నేపథ్యంలో ఉద్యోగం చేయడమెంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఓ సవాలే. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం వెలగబెట్టడం అంత సులువైన విషయమేమీ కాదు. దీనికి సర్వశక్తులు ఒడ్డాలి. మన తెలివితేటలకు పదును పెట్టాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా జీనియస్ కన్సల్టెంట్ అనే సంస్థ చేసిన ఓ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.
Also Read: Women’s Empowerment: నిర్ణయాత్మక స్థానాల్లో మహిళలే మొగ్గు
వారాంతంలో ఆదివారం మాత్రమే సెలవు ఉండటంతో ఒక్క రోజు లీవు తీసుకుంటే వీలు కాదని రెండు రోజులు రెస్ట్ కావాల్సిందే అని ఉద్యోగులు చెబుతుండటం విశేషం. రోజుకు పన్నెండు గంటలు పనిచేసినా మంచిదే కానీ వారాంతంలో రెండు రోజులు సెలవు ఉండాల్సిందేనని చెప్పడం తెలిసిందే. సర్వేలో 56 శాతం మంది రెండు రోజుల సెలవుకే మొగ్గు చూపారు. ఇక 44 శాతం మంది మాత్రమే సాధారణ పనిగంటలకు మించి పని చేయడానికి సిద్ధంగా లేమని చెప్పడం విశేషం.
దేశంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంజినీరింగ్, విద్యారంగం, ఐటీ, మీడియా తదితర రంగాల్లో పనిచేసే వారితో సర్వే నిర్వహించగా వారు ఈ మేరకు తమ నిర్ణయం ప్రకటించారు. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు తమకు విశ్రాంతి అవసరమని చెప్పడం సమంజసమే. ఎందుకంటే నిత్యం పని ఒత్తిడితో ప్రతి రోజు అలసిపోయే ఉద్యోగులకు రెండు రోజులు ఇంటి పట్టున ఉంటే తరువాత రోజు మంచి ఉత్సాహంతో పనిచేయగలుగుతారని వారి అభిప్రాయం.

ప్రస్తుతం ప్రైవేటు రంగంలో పనిచేసేవారికే ఎక్కువ పని ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారు విధుల కంటే విశ్రాంతికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కాలక్షేపం చేస్తుంటారు దీంతో ఉద్యోగులు వెల్లడించిన వారి మనోగతంపై ప్రైవేటు సెక్టార్ చర్యలు తీసుకుంటుందా? తీసుకుంటే ఎలా ఉంటుందనే దానిపైనే అందరిలో చర్చ సాగుతోంది. ఏదిఏమైనా ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించేందుకు సంస్థలు ముందుకు వస్తాయో లేదో వేచి చూడాల్సిందే.
Also Read:Sri Rama Kalyanam In Bhadradri: భదాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీరామ కల్యాణం