AP New Cabinet: ఏపీ మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ముంచుకొస్తోంది. మరో 24 గంటల వ్యవధే ఉంది. దీంతో అంతటా టెన్షన్ టెన్షన్ నెలకొంది. కొత్త మంత్రులు ఎవరు అన్న చర్చ లోతుగా సాగుతోంది. మరోవైపు నూతన మంత్రివర్గం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా కొత్త మంత్రి వర్గం కసరత్తు ఎన్నడూ లేనివిధంగా సీఎం జగన్ మెడకు చుట్టుకుంది. కొత్త కేబినెట్ కూర్పునకు సుదీర్ఘ సమయం వెచ్చించారు. గవర్నర్ ఆమోదానికి ఇప్పటికే రాజీనామా లేఖలు పంపించారు. సీనియర్‌ల ఒత్తిడికి దిగివచ్చిన ముఖ్యమంత్రి 8 నుంచి 10 మంది పాత వారికి కాబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు సమాచారం.

సీఎం మారిన వైఖరిపై పార్టీలో లోతైన చర్చ జరుగుతోంది. సీనియర్‌లను తొలగించడం సీఎంకు అంత సులువు కాదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీనియర్‌ల పేర్లు జాబితాలో పెరగడంతో 4 నుంచి ఐదుగురి ఆశావహులకు మొండి చేయి తప్పదని తెలస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికి 25 మంది నూతన మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం. అనంతరం అందుబాటులో ఉండాలంటూ సీఎంవో నుంచి మంత్రులుగా ఎంపిక చేసిన ఆ 25 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు రానున్నాయి. చివరి నిముషంలో అయిన తమ అవకాశాలను నిలుపుకోవడానికి ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాగా ఏపీ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు చేశారు. సోమవారం ఉదయం 11:31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో అధికారులు తలమునకలై ఉన్నారు.
Also Read: Women’s Empowerment: నిర్ణయాత్మక స్థానాల్లో మహిళలే మొగ్గు
కొత్త.. పాత కలయికతో..
కొత్త మంత్రివర్గంలోకి 10 మంది పాత వారికి అవకాశం కల్పిస్తూ… 15 మంది కొత్తవారు రాబోతున్నారు. పాత, కొత్త కలయికతోనే కేబినెట్ ఉండనుంది.పాతవారిలో సీదిరి అప్పలరాజు, వేణుగోపాల కృష్ణ, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, అంజాద్‌బాషా, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తదితరులను కొనసాగించనున్నట్టు తెలుస్తోంది.
కొత్తగా ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, విడదల రజనీ, రాజన్న దొర, కాకాణి గోవర్దన్‌రెడ్డి, మేరుగ నాగార్జున, పార్థసారథి, కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, ధనలక్ష్మి, రోజా తదితరులను అవకాశమిచ్చినట్టు సమాచారం. అయితే పక్క రాష్ట్రాల ప్రముఖులు, కొందరి పీఠాధిపతులు మంత్రి పదవుల కోసం చాలామందికి సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అయితే పాత వారికి కొనసాగింపుతో చాలా మంది ఆశావహుల అవకాశాలపై నీళ్లు చల్లినట్టు తెలుస్తోంది. మరో వైపు జగన్ కేబినెట్‌లోకి కొత్తగా తీసుకుంటున్న మంత్రుల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో తెలియక ముందే కొంతమంది వైసీపీ నాయకులు మాత్రం తెగ హడవుడి చేస్తున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

పార్టీ అధిష్ఠానం కొత్త మంత్రుల జాబితా ప్రకటించకముందే ధర్మాన ప్రసాదరావు అనుచరుల వ్యవహార శైలి మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న.. ధర్మాన ప్రసాదరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ అనుచరులు ఫెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా హైకమాండ్ నుంచి మంత్రి పదవులపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ విషయంలో క్యాడర్ హడవుడి మాత్రం తగ్గడం లేదు. గత మూడేళ్లుగా అటు సోదరుడు క్రిష్టదాస్, ఇటు స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహార శైలితో ధర్మాన ప్రసాదరావుతో పాటు కేడర్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కుతుందన్న ఆనందంలో శ్రుతిమించి వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
[…] Ravi Shastri: IPl అభిమానుల్లో ఎంతో ఆసక్తిరేపే మ్యాచులు ఏవైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచే. నువ్వా నేనా అన్నట్లు సాగే ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ అంటే అందరికీ ఎంతో ఆసక్తి. ఇప్పటి వరకు నమోదైన రికార్డులు కూడా ఈ రెండు టీంల మధ్య ఎంత పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది. IPLలో ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉందంటే.. క్రీడాభిమానులకు అదో ఊపు. […]