Homeజాతీయ వార్తలుStudent Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త ఉద్యమానికి దారితీస్తుంది. ఆ ఉద్యమం రకరకాల పరిణామాలకు కారణమవుతుంది. ఒక దేశం బాగుండాలంటే అక్కడి యువత సానుకూలంగా ఉండాలి. ఒక దేశం నాశనం కావాలంటే ఆ యువతలో నిరాశ పెరిగిపోవాలి. ఇటీవల కాలంలో శ్రీలంక.. బంగ్లాదేశ్.. భూటాన్ పరిణామాలు దీనినే నిరూపించాయి. మనదేశంలో కూడా యువత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన దారుణాలను తట్టుకోలేక రోడ్ల మీదకు వచ్చింది. అందువల్లే కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.

మనదేశంలో బొద్దింకలు చేసిన ఉద్యమమే మొదటిది కాదు. వాస్తవానికి విద్యార్థులు పెరిగిన ఆగ్రహానికి ఈ ఉద్యమం ప్రత్యక్ష ఉదాహరణలాగా నిలిచింది. అయితే ఇంతకుమించిన ఉద్యోగాలు మనదేశంలో చాలా జరిగాయి. అవి మన దేశ రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేశాయి. ఆ ఉద్యమాల ద్వారా కొత్తకొత్త నాయకులు పుట్టుకొచ్చారు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశారు.

1965.. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం

దక్షిణాదిలో ప్రముఖ రాష్ట్రమైన తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది.. 1963 లో అప్పటికేంద్ర ప్రభుత్వం అధికార భాష చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనికి వ్యతిరేకంగా ద్రావిడ మున్నేట్ర కళగం గొంతు సవరించింది. అయితే నాటి బిల్లును పార్లమెంటు ఆమోదించింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంటుందని నెహ్రూ హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత 1964లో నెహ్రూ మరణం అనంతరం తమిళనాడు రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని కాంగ్రెస్ అమలులోకి తీసుకొచ్చింది. దీనిని విద్యార్థులు తప్పు పట్టారు. రోడ్లమీదకి వచ్చి నిరసనలు చేపట్టారు. నాటు గొడవల్లో 70 మంది చనిపోయారు. అయితే నెహ్రూ ఇచ్చిన మాటనే అమలు చేస్తామని నాటి ప్రధానమంత్రి శాస్త్రి హామీ ఇవ్వడంతో వివాదం ముగిసిపోయింది. ఇక అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేకపోయింది.

1974, నవనిర్మాణ ఆందోళన

గుజరాత్ రాష్ట్రంలో ప్రముఖ నగరమైన అహ్మదాబాద్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ మెస్ ఛార్జీలను ఏకంగా ఈరోజు అతను పెంచింది. దీంతో 1974 జనవరి 3న గుజరాత్ యూనివర్సిటీ విద్యార్థులకు.. పోలీసులకు గొడవ జరిగింది. దీంతో నాడు విద్యార్థులు గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజులకు గుజరాత్ వ్యాప్తంగా సమ్మె మొదలైంది. పరిస్థితి అదుపుతప్పింది.. కేంద్రం ఒత్తిడితో ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.

1974, బీహార్ విద్యార్థి ఉద్యమం

అవినీతి అక్రమాలను తట్టుకోలేక.. ఎన్నికలలో సంస్థలను తీసుకురావాలని.. నాటి సోషలిస్టు నేత జయప్రకాష్ నారాయణన్ ఆధ్వర్యంలో ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమం దేశ రాజకీయాలను సమూలంగా మార్చింది. ఈ ఉద్యమం ద్వారా ములాయం సింగ్ యాదవ్.. లాలు ప్రసాద్ యాదవ్.. నితీష్ కుమార్ వంటి నాయకులు తెరపైకి వచ్చారు. ఆ తర్వాత దేశ రాజకీయాలను ఈ ముగ్గురు నాయకులు తీవ్రంగా ప్రభావితం చేయగలిగారు.

1975, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం

ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నాడు దేశం మొత్తం దారుణంగా ఉండేది.. నాడు జయప్రకాష్ నారాయణన్ తోపాటు 300 మంది విద్యార్థి సంఘం నేతలను జైలుకు తరలించారు. నాడు దేశవ్యాప్తంగా వ్యవస్థలు మొత్తం నాశనమయ్యాయి. ఇందిరాగాంధీ ఉక్కు పాదంతో ఉద్యమాలను అణచివేశారు. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది.

అస్సాం ఉద్యమం

బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమార్కులను దేశం నుంచి తరిమి కొట్టాలని ఈ ఉద్యమం ప్రారంభమైంది. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం అనంతరం చాలామంది అక్కడి ప్రజలు అస్సాంలోకి వచ్చారు. అయితే ఇది తమ భాష సంస్కృతికి ముప్పుగా మారిందని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు అయింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమైంది. నాడు ఈ సంస్థకు ప్రపుల కుమార్ మొహంతా నాయకత్వం వహించారు. ఆ తర్వాత 1985లో ఆయన అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి ఆయన వయసు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే.

2006.. రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం

ప్రభుత్వం నుంచి మొదలు పెడితే ప్రైవేట్ విద్యాసంస్థల వరకు ఓ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు.. అనుకూలంగా కొన్ని వర్గాలు ఉద్యమాలు నిర్వహించాయి.

2012, నిర్భయ ఉద్యమం

2012లో ఢిల్లీలో ఒక 23 సంవత్సరాల విద్యార్థి మీద సామూహికమైన దారుణం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. దేశంలో మహిళల సంరక్షణపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ ఉద్యమంలో నిర్భయ చట్టం 2013 అందుబాటులోకి వచ్చింది.

జాదవ్ పూర్ విశ్వవిద్యాలయ ఉద్యమం

విద్యార్థులపై పోలీసులు దాడి చేయడంతో జాదవ్పూర్ యూనివర్సిటీలో ఉద్యమం రూపు దిద్దుకుంది. ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక విద్యార్థి మీద అత్యాచారం జరిగింది దీనిపై విద్యార్థులు ఆందోళనలకు దిగారు. అంతేకాదు ఉద్యమం కూడా చేపట్టారు. స్నాతకోత్సవం రోజు పట్టాలు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. నాడు ఏకంగా కొంతమంది విద్యార్థులు వైస్ ఛాన్సలర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

మండల్ వ్యతిరేక ఉద్యమం

వి.పి సింగ్ సంకీర్ణ ప్రభుత్వం నాడు మండల్ కమిషన్ సిఫారసులను ఆమోదించింది. దీనిద్వారా ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు దక్కుతాయి. దీంతో ఈ ఉద్యమం తీవ్ర రూపు దాల్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో ఈ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. 1990 నవంబర్ 7న బిజెపి సపోర్ట్ వెనక్కి తీసుకోవడంతో.. విపి సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో మండల్ వ్యతిరేక ఉద్యమం వీగిపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....
Oktelugu Epaper