Janasena- Namrata: పవన్ అభిమానులకు, జనసైనికులకు ఇప్పుడు పండుగ వాతావరణం. త్వరలో పవన్ సినిమాలతో పాటు ఆయన రాజకీయ యాత్రలు ప్రారంభించనుండడంతో ఉత్సాహం నెలకొంది. ఇప్పుడు ఏపీలో జనసేన చుట్టూ రాజకీయాలు తిరుగుతుండడం కూడా పార్టీ శ్రేణులకు ఆనందాన్నిస్తోంది. అటు సినీరంగం సైతం పవన్ వెంట నడవనుందన్న సంకేతాలు రావడంతో జనసేనలో మరింత జోష్ నెలకొంది. ముఖ్యంగా ఇతర ప్రముఖ హీరోల సపోర్టు కూడా లభిస్తుండడం ఆ పార్టీకి శుభ పరిణామం. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ జనసేనలో చేరనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఇది పొలిటికల్, సినిమారంగంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ ఘట్టమనేని వారి కోడలుగా క్రియాశీలక పాత్ర వహించిన ఆమె.. రాజకీయ యవనికపై అడుగు పెట్టడం ఆసక్తిగా మారింది.

ఘట్టమనేని కుటుంబసభ్యలకు రాజకీయాలు కొత్త కావు. సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ లో క్రియాశీలక పాత్ర వహించారు. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో కూడా కృష్ణ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండేవారు. అటు ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు సైతం కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం కొనసాగారు. వీరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆత్మీయ అనుబంధం ఉండేది. వైసీపీ ఆవిర్భావం తరువాత కృష్ణ కుటుంబం జగన్ వెంటే ఉండేది. ఆదిశేషగిరిరావు వైసీపీలో చాలా యాక్టివ్ గా పనిచేశారు. కానీ వారికి తగ్గ ప్రాధాన్యం దక్కకపోవడంతో 2019 ఎన్నికల ముందు ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు.

కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఆమె తల్లి గల్లా అరుణకుమార్ మాజీ మంత్రి. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ బాధ్యురాలిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం కుటుంబమంతా టీడీపీలోనే ఉంది. అయితే మహేష్ భార్య నమ్రతా మాత్రం జనసేన వైపు మొగ్గుచూపుతుండడం విశేషం. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసే వెళుతుందని.. కీలక నియోజకవర్గాల్లో తటస్థులు, సెలబ్రెటీలు అడుగుపెడితే సునాయాస విజయం పొందే అవకాశం ఉంది. అందులో భాగంగానే నమ్రత శిరోద్కర్ జనసేన వైపు మొగ్గుచూపినట్టు సమాచారం. అదే జరిగితే ఘట్టమనేని వారి కోడలు చట్టసభల్లో అడుగుపెట్టే చాన్స్ ఉందన్న మాట..