Homeఎంటర్టైన్మెంట్Samantha Marriage With Chennai Businessman: చెన్నై వ్యాపారవేత్తతో సమంత పెళ్లి... ఇదే స్ట్రాంగ్ ప్రూఫ్!

Samantha Marriage With Chennai Businessman: చెన్నై వ్యాపారవేత్తతో సమంత పెళ్లి… ఇదే స్ట్రాంగ్ ప్రూఫ్!

Samantha Marriage With Chennai Businessman: సమంత రెండో పెళ్లి వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది. అయితే దీన్ని పుకారుగా కొట్టిపారేయలేం, దానికిదే నిదర్శనం అంటున్నారు. వయసు కాని వయసులో సమంతకు విడాకులయ్యాయి. ఆమె ప్రస్తుత వయసు 35 ఏళ్ళు. లేటు చేస్తే ఏజ్ బార్ అవుతుంది కాబట్టి, రెండో పెళ్ళికి ఇదే సరైన సమయం. ఈ క్రమంలో ఆమె కూడా పెళ్లి నిర్ణయం తీసుకున్నారట. జీవితానికి సంబంధించిన ఈ కీలక విషయంలో సమంత సద్గురు బాబా సలహా తీసుకున్నారట. ఆయన కోరిక మేరకు, నిర్ణయించిన అబ్బాయితో ఏడడుగులు వేయనున్నారట.

Samantha Marriage With Chennai Businessman
Samantha

ఇక సమంత వివాహం చేసుకోబోయే వ్యక్తి చెన్నైకి చెందిన బడా వ్యాపారవేత్త అట. ఆయనతో సమంత వివాహం దాదాపు ఖాయమే అంటున్నారు. సమంత టీం ఈ విషయాన్ని ఖండించకపోవడమే నిదర్శనం అంటున్నారు. ఇటీవల సమంత ఆరోగ్యంపై అనేక పుకార్లు వచ్చాయి. ఆమె అరుదైన స్కిన్ డిసీజ్ తో బాధపడుతున్నారని, చికిత్స కోసం అమెరికా వెళ్లారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను సమంత మేనేజర్ ఖండించారు. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. చికిత్స కోసం అమెరికా వెళ్లారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిపారేశారు.

Also Read: Renu Desai: నిన్నే జరిగినట్లు అనిపిస్తుంది.. పాత అనుభవాలు తలచుకుంటూ పవన్ మాజీ వైఫ్ రేణూ ఎమోషనల్ పోస్ట్!

సమంత రెండో పెళ్లి కథనాలపై మాత్రం వారు మౌనం వహించారు. దీంతో సమంత పెళ్లి చేసుకుంటున్నారనే విషయాన్ని కొట్టిపారేయలేమనేది టాలీవుడ్ వర్గాల అభిప్రాయం. మరోవైపు నాగ చైతన్య వివాహం చేసుకోనున్నారని వార్తలు వస్తుండగా సమంత ఆయన కంటే ముందు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే సమంత మాజీ భర్తపై రగిలిపోతుంది. నాగ చైతన్య పై కోపాన్ని ఇటీవల బాలీవుడ్ షో కాఫీ విత్ కరణ్ లో నేరుగా చూపెట్టారు. మీ భర్త నాగ చైతన్య అని హోస్ట్ కరణ్ సంబోధించగా… భర్త కాదు మాజీ భర్త అన్నారు. అంతటితో ఆగకుండా చైతూ, నేను ఒకే గదిలో ఉండాల్సి వస్తే అక్కడ పదునైన కత్తులు ఉంచాలి అన్నారు. మగాళ్ల బుద్ధి అలాంటిదే, వాళ్లపై కోపంతోనే ”ఊ అంటావా మామా ఊ ఊ అంటావా మామ” సాంగ్ చేశానని పరోక్షంగా నాగ చైతన్యను ఉద్దేశించి మాట్లాడారు.

Samantha Marriage With Chennai Businessman
Naga Chaitanya, Samantha

కావున నాగ చైతన్యపై పంతంతో కూడా సమంత మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. విడాకులు ప్రకటన నాటి నుండి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనేది నిజం. గత అనుభవాల రీత్యా జీవితంలో సమంత పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు గతంలో వార్తలు రావడం కొసమెరుపు. విడాకుల తర్వాత పూర్తి ఫోకస్ కెరీర్ పై పెట్టిన సమంత వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించారు. మైథలాజికల్ మూవీ శాకుంతలం నవంబర్ 4న విడుదల కానుంది. అలాగే సైకలాజికల్ థ్రిల్లర్ యశోద విడుదలకు సిద్దమవుతుంది. ఇక విజయ్ దేవరకొండకు జంటగా చేస్తున్న ఖుషి చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం.

Also Read: Nara Lokesh- NTR: జూ. ఎన్టీఆర్ ను తిట్టించిన నారా లోకేష్.. రంగంలోకి తారక్ ఫ్యాన్స్.. దెబ్బకు గేమ్ చేంజ్.. అసలేం జరిగింది ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular