https://oktelugu.com/

Maharashtra-Jharkhand Election Results: మహారాష్ట్రలో మహాయుతి జోరు.. జార్ఖండ్‌లో బీజేపీ ఆధిక్యం..

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ శనివారం(నవంబర్‌ 23న) ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించారు. తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 23, 2024 / 10:15 AM IST

    Maharashtra-Jharkhand Election Results

    Follow us on

    Maharashtra-Jharkhand Election Results: దేశంలో రెండు నెలలుగా ఆసక్తి చేపుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 20 ముగిసింది. దీంతో నవంబర్‌ 23న ఈసీ కౌంటింగ్‌ చేపట్టింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలైంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలో మరో మూడు నాలుగు గంటల్లో రానున్నాయి. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు వచ్చాయి. ఇందులో ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగానే మహారాష్ట్రలో మహాయుతి కూటమికి, జార్ఖండ్‌లో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ, కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ కూడా జరుగుతోంది.

    మహారాష్ట్రలో మహాయుతి..
    మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల మరకే వస్తున్నాయి. మహాయుతి కూటమి ఆధిక్యత కనబరుస్తోంది. ఇక జార్ఖండ్‌లో బీజేపీ ముందంజలో ఉంది.

    ఫలితాల సరళి ప్రకారం..

    మొదటి రౌండ్‌ పూర్తయ్యే సరికి మహారాష్ట్రలో మహాయుతి కూటమి 68 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

    – జార్కండ్‌లో బీజేపీ నేతృత్వంలోని కూటమి 5, జేఎంఎం నేతృత్వంలోని కూటమి 3 స్థారాల్లో ముందంజలో ఉన్నాయి.

    – ఇక కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదస్‌ రెండో స్థానంలో ఉన్నారు.

    ఆధిక్యంలో వీరు..
    ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖులు ఆధిక్యంలో ఉన్నారు. జార్ఖండ్‌లోని బర్మత్‌లో ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సోరేన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గండే నుంచి పోటీ చేసిన ఆయన భార్య కల్పనా సోరెన్‌ కూడా ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నాగ్‌పూర్‌ సౌత్‌వెస్ట్‌లో ఆధిక్యంలో ఉన్నారు. బారామతిలో ఎన్‌సీపీ అభ్యర్థి అజిత్‌ పవార్‌ ముందంజలో కొనసాగుతున్నారు. వర్లీలో శివసేన(యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్షకే ఆధిక్యంలో ఉన్నారు. ఇక కోప్రిలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే ముందంజలో కొనసాగుతున్నారు. వాండ్రే ఈస్ట్‌లో బాబా సిద్ధిఖీ కుమారుడు జిశాన్‌(ఎన్‌సీపీ) ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక వయనాడ్‌లో రెండో రౌండ్‌ పూర్తయ్యే సరికి ప్రియాంక గాంధీ 46 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.