Mechanic Rocky : నవంబర్ 22న రెండు చిత్రాలు థియేటర్స్ లోకి వచ్చాయి. ఒకటి విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ, సత్యదేవ్ హీరోగా చేసిన జీబ్రా. ఈ రెండు చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ఫ్లాట్ ఫార్మ్ కి సంబంధించిన డిటైల్స్ లీక్ అయ్యాయి.
దేవర అనంతరం పెద్దల చిత్రాలేవి విడుదల కాలేదు. దాంతో వరుసగా చిన్న హీరోలు తమ చిత్రాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ వారం ఇద్దరు చిన్న హీరోలు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు బాక్సాఫీస్ బరిలో నిలిచారు. విశ్వక్ సేన్, సత్యదేవ్ నటించిన చిత్రాలు థియేటర్స్ లోకి వచ్చాయి. దర్శకుడు రవితేజ ముళ్ళపూడి మెకానిక్ రాకీ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. శ్రద్ధ శ్రీనాధ్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.
మెకానిక్ రాకీ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బోరింగ్ అంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ పర్లేదు. అలరించే ట్విస్ట్స్ తో కొంత మేర ఆసక్తికరంగా సాగుతుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. విశ్వక్ సేన్ కెరీర్లో మొదటిసారి మెకానిక్ రోల్ చేశాడు. కాగా మెకానిక్ రాకీ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. డిసెంబర్ మూడో వారం లేదా చివరి వారంలో స్ట్రీమింగ్ కావచ్చట. మూవీ బాక్సాఫీస్ వద్ద సరిగా పెర్ఫార్మ్ చేయని పక్షంలో ఇంకా ముందుకు వచ్చే సూచనలు కలవు.
తన గ్యారేజ్ ని కాపాడుకునేందుకు హీరో చేసే ప్రయత్నమే ఈ చిత్రం. రూ. 50 లక్షలు ఇస్తేనే గ్యారేజ్ ని కూల్చివేయను అని విలన్ సునీల్ కండిషన్ పెడతాడు. అప్పుడు హీరోకి ఎదురైన సమస్యలు ఏంటనేది కథ..
మరో చిత్రం జీబ్రా. క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించాడు. సత్యదేవ్ హీరోగా నటించగా.. కన్నడ నటుడు ధనుంజయ మరో ప్రధాన పాత్ర చేశాడు. ప్రియా భవాని శంకర్, అమృత అయ్యంగార్ హీరోయిన్స్ గా నటించారు. జీబ్రా మూవీ సైతం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక జీబ్రా డిజిటల్ రైట్స్ కూడా అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట. జీబ్రా వచ్చే నెల రెండో వారం లేదా మూడో వారం స్ట్రీమ్ కానుందట.
జీబ్రా మూవీ కథ పరిశీలిస్తే… హీరో ఓ బ్యాంకు లో ఎంప్లొయ్. తన ప్రేయసి మరొక బ్యాంకు లో పని చేస్తుంది. ఆమె చేసిన మిస్టేక్ వలన హీరోకి సమస్యలు మొదలవుతాయి. హీరో అకౌంట్ లో సడన్ గా నాలుగు కోట్ల రూపాయల డబ్బులు పడతాయి. అవి నావే అని విలన్ రంగంలో దిగుతాడు. ఈ క్రమంలో హీరో, విలన్ మధ్య చోటు చేసుకున్న సంఘర్షణే ఈ చిత్రం.