మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్లాస్టిక్ వేస్టేజ్ ను తగ్గించాలనే ఉద్దేశంతో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన పట్టణాల్లో ప్లాస్టిక్ వేస్టేజ్ ను ఇస్తే ఉచితంగా ఫుడ్ కూపన్స్ ఇవ్వనుంది. ప్రస్తుతం పట్టణాల్లో మాత్రమే ప్లాస్టిక్ వేస్టేజ్ ఇచ్చి ఫుడ్ కూపన్స్ పొందే అవకాశం ఉండగా భవిష్యత్తులో చిన్న పట్టణాల్లో కూడా ఈ నిర్ణయం అమలు కానుంది. ప్రభుత్వం ప్లాస్టిక్ వేస్టేజ్ ను కలెక్ట్ చేసుకునేందుకు వేస్ట్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
Also Read: రేషన్ కార్డ్ ఉంటే 2,500 రూపాయలు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్..?
రాష్ట్రంలోని పౌరులు 5 కేజీలు అంతకంటే ఎక్కువ ప్లాస్టిక్ వేస్టేజ్ ను ఇచ్చి ఫుడ్ కూపన్స్ ను పొందవచ్చు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. ఈ స్కీమ్ ద్వారా ప్లాస్టిక్ వేస్టేజ్ తగ్గడంతో పాటు ప్లాస్టిక్ వేస్టేజ్ ఇచ్చిన వారికి ఫుడ్ కూపన్స్ లభించనుండటంతో ప్రజలు ప్లాస్టిక్ వేస్టేజ్ ఇచ్చి ఫుడ్ కూపన్స్ ను తీసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపుతున్నారు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండా 50వేల వేతనంతో ఉద్యోగాలు..?
ఈ స్కీమ్ ద్వారా చెత్తను తగ్గించడంతో పాటు అవసరమైన వారికి కడుపు నిండా భోజనం లభిస్తూ ఉండటం గమనార్హం. కల్యాణ్ దోంబివలి కార్పొరేషన్ ద్వారా ఈ సరికొత్త స్కీమ్ అమలవుతోంది. కల్యాణ్ దోంబివలి కార్పొరేషన్ జీరో వేస్ట్ పాలసీలో భాగంగా ఈ వినూత్న స్కీమ్ ను అమలులోకి తెచ్చినట్టు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఇలాంటి స్కీమ్ లను అమలు చేస్తే బాగుంటుందని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఈ స్కీమ్ ను అమలులోకి తెచ్చిన తరువాత ప్లాస్టిక్ వేస్టేజ్ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఈ స్కీమ్ ను అమలు చేయడంపై ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.