నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండా 50వేల వేతనంతో ఉద్యోగాలు..?

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 50 వేల రూపాయల వరకు భారీ వేతనంతో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రెయినీ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. బెల్ కంపెనీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ప్రక్రియ చేపడుతోంది. బెల్ సంస్థ రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు భర్తీ చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 6 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. Also Read: నిరుద్యోగులకు […]

Written By: Navya, Updated On : December 22, 2020 12:35 pm
Follow us on


భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 50 వేల రూపాయల వరకు భారీ వేతనంతో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రెయినీ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. బెల్ కంపెనీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ప్రక్రియ చేపడుతోంది. బెల్ సంస్థ రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు భర్తీ చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 6 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

Also Read: నిరుద్యోగులకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గుడ్ న్యూస్.. రూ.40 వేల వేతనంతో ఉద్యోగాలు..?

https://bel-india.in/ వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్ లైన్ లోనే మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. bharat electronics limited , jalahalli post office , bangalore , 560013 అడ్రస్ కు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలు కాగా ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టులకు 500 రూపాయలుగా ఉంది.

Also Read: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. కంపెనీలకు హెచ్చరిక..?

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు 75 శాతం వెయిటేజీ అకాడమిక్ మార్కుల ఆధారంగా, 10 శాతం వెయిటేజీ అనుభవం ఆధారంగా, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా 15 శాతం వెయిటేజీ ఉంటుంది. బీఈ / బీటెక్ అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అనుభవం ఉంటే మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంఈ/ఎంటెక్ అభ్యర్థులు మాత్రం ఈ ఉద్యోగాలకు అనుభవం లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 2020 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నాటికి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు 50 వేల రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ట్రెయినీ ఇంజినీర్ ఉద్యోగాలకు 2020 డిసెంబర్ 1 నాటికి 25 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు 31 వేల రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పాసైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.