https://oktelugu.com/

కేసీఆర్ కు డబ్బులు ఇచ్చాను.. బాంబు పేల్చిన విజయశాంతి

ఎక్కడ సైలెంట్ గా ఉండాలో కాదు.. ఎప్పుడు చావు దెబ్బ తీయాలో తెలంగాణ ఫైర్ బ్రాండ్ రాములమ్మకు బాగా తెలుసు. బీజేపీలో చేరాక వాళ్ల సలహాలో ఏమో కానీ మరింత రాటుదేలారు. కర్రు కాల్చి వాతపెట్టడం రాములమ్మకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదేమో.. అసలే దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఎదురుదెబ్బలతో విశ్వసనీయతను పోగొట్టుకున్న  తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పై ఓరకంగా బాంబు పేల్చారు. ఆమె […]

Written By: , Updated On : December 21, 2020 / 08:38 PM IST
Follow us on

KCR Vijayasanthi

ఎక్కడ సైలెంట్ గా ఉండాలో కాదు.. ఎప్పుడు చావు దెబ్బ తీయాలో తెలంగాణ ఫైర్ బ్రాండ్ రాములమ్మకు బాగా తెలుసు. బీజేపీలో చేరాక వాళ్ల సలహాలో ఏమో కానీ మరింత రాటుదేలారు. కర్రు కాల్చి వాతపెట్టడం రాములమ్మకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదేమో.. అసలే దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఎదురుదెబ్బలతో విశ్వసనీయతను పోగొట్టుకున్న  తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పై ఓరకంగా బాంబు పేల్చారు. ఆమె వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి.

Also Read: బీజేపీ వ్యతిరేక సమావేశాన్ని కేసీఆర్ ఎందుకు విరమించుకున్నారు?

ఇన్నాళ్లు కాంగ్రెస్ లో ఉన్న విజయశాంతి ఇటీవలే బీజేపీలో చేరారు. తెలంగాణలో బీజేపీ వరుస విజయాల నేపథ్యంలో ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే గతంలో టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ లూప్ హోల్స్ అన్నీ బయటపెడుతూ కేసీఆర్ ను ఇరకాటంలో నెడుతున్నారు. ఈ సందర్భం కోసమే చూస్తున్న బీజేపీ దీన్ని ఇప్పుడు క్యాష్ చేసుకుంటోంది.

టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు లేవని విజయశాంతి వివరించారు. ఎవరు డబ్బులు ఇస్తారా? అని వెతుక్కునే వారని ఆమె అన్నారు. ఉద్యమం కాబట్టి ఒకానొక సందర్భంలో తాను కూడా ఉద్యమం కోసం కేసీఆర్ కు డబ్బులు ఇచ్చానని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: వరంగల్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్..!

ఉద్యమ సమయంలో కొంత డబ్బును కేసీఆర్ డైవర్ట్ చేశారని.. మాకు తెలిసినా ఊరుకున్నామని రాములమ్మ సంచలన వ్యాఖ్యలుచేశారు. ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఆ విషయం బయటకు రాలేదని విజయశాంతి చెప్పుకొచ్చారు.ఎప్పుడైతే కేసీఆర్ సీఎం అయ్యారో డబ్బు మీద ఆశ మరింత పెరిగిందని అన్నారు. తెలంగాణ అంతా తన సామ్రాజ్యం అనే రీతిలో కేసీఆర్ రెచ్చిపోతున్నారని విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు.

ఇప్పుడు తెలంగాణలో సీఎం కావడంతో కేసీఆర్ ఆడింది ఆటపాడింది పాటగా మారిందని విజయశాంతి ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని.. లక్ష కోట్ల రూపాయలకు పడగలెత్తారని విజయశాంతి ఆరోపించారు.పథకాలతో వేల కోట్లు కేసీఆర్ దోచుకున్నారని విజయశాంతి ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్