Maharashtra-Jharkhand Election 2024 : రెండు నెలలుగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి మహారాష్ట్రలో విజయం సాధించగా, కాంగ్రెస్ కూటమి జార్ఖండ్‌లో జెండా ఎగురవేసింది. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 223 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక జార్ఖండ్‌లో అధికార జేఎంఎం నేతృత్వంలోని కూటమి విజయం వైపు దూసుకెళ్తోంది. 58 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక్కడ బీజేపీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది.
పాలకులకే పట్టం..
ఈ రెండు రాష్ట్రాల ఓటర్లు ఈసారి భిన్నంగా ఆలోచించారు. రెండు రాష్ట్రాల ప్రజలు సిట్టింగ్ ప్రభుత్వాలనే కోరుకున్నారు. మహారాష్ట్ర ఓటర్లు కమలం నేతృత్వంలోని పాలనే మళ్లీ కోరుకున్నారు. అందుకే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన(ఏకనాథ్‌షిండే), ఎన్‌సీపీ(శరద్‌పవార్) పార్టీల కూటమికే మళ్లీ పట్టం కట్టారు. గతంలోకంటే ఎక్కువ సీట్లలో గెలిపించారు. ఇక జార్ఖండ్‌లోనూ ఓటర్లు పాలక పక్షాన్ని మళ్లీ కోరుకున్నారు. ఆ రాష్ట్ర చరిత్రలో వరుసగా ఒక పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జేడీ, మరో రెండు ప్రాంతీయ పార్టీల కూటమిని గెలిపించారు. ఈ కూటమి గతంలోకన్నా ఎక్కువ స్థానాల్లో అధిక్యంలో ఉంది. 58 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.
ఐదు గ్యారంటీలు రిజెక్ట్..
కాంగ్రెస్ పార్టీ రెండేళ్లుగా గ్యాంరటీ హామీలతో గెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఐదు గ్యారంటీ హామీలు ఇచ్చింది. అక్కడి ప్రజలు గెలిపించారు. కర్ణాటకలోనూ ఐదు గ్యారంటీ హామీలో అక్కడి ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. గతేడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ ఆరు గ్యాంరటీ హామీలు బాగా పనిచేశాయి. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో మరోమారు ఐదు గ్యారంటీ హామీలు ఇచ్చింది. కానీ, మరాఠాలు కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ హామీలను పట్టించుకోలేదు.
కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు ఇవే..
1. మహాలక్ష్మి యోజన కింద మహిళలకు నెలకు రూ.3 వేల చొప్పున మహిళకు ఆర్థికసాయం, మహిళలు, బాలికలకు ఉచిత బస్సు ప్రయాణం.
2. రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ, సక్రమంగా రుణం చెల్లిస్తే రూ.50,000 ప్రోత్సాహకం.
3. రాష్ట్రంలో కులాల వారీగా జనాభా గణన నిర్వహించి 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించేందుకు కృషి.
4. పేదలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా, రోగులకు ఉచితంగా మందులు పంపిణీ.
5. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల ఆర్థికసాయం.
ఈ ఐదు హామీలను మరాఠాలు పట్టించుకోలేదు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతికే పట్టం కట్టారు.
జేఎంఎం ఏడు గ్యాంటీలు
ఇక జార్ఖండ్‌లో జేఎంఎం ఏతృత్వంలోని కూటమి ఏడు హామీలు ఇచ్చింది. ఇక్కడి ఓటర్లు ఏడు హామీలను విశ్వసించారు. అధికార కూటమిని ఎగలిపించారు. జేఎంఎం కూటమి ఇచ్చిన హామీలు..
1. దేశంలో 1932లో అమలు చేసిన ఖతియాన్ విధానం ఆధారంగా సర్నా మత నియమావళి అమలు.
2. డిసెంబర్ 2024 నుంచి మైయా సమ్మాన్ పథకం కింద రూ.2,500 అందించడం.
3. మైనార్టీల ప్రయోజనాల పరిరక్షణకు వెనుబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు.
4. రాష్ట్రంలో పేద కుటుంబాలకు రూ.450కే గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 7 కిలోల చొప్పున బియ్యం.
5. 10 లక్షల మంది యువకులకు ఉపాధి, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య భృతి కల్పించటం.
6. ఇక ప్రతీ బ్లాక్‌లో మెడికల్, ఇంజినీనిరింగ్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల ఏర్పాటు. ప్రతీ జిల్లాలో 500 ఎకరాల్లో ఇండస్ట్రీలయల్ పార్కు ఏర్పాటు.
7. ధాన్యం మద్దతు ధర రూ.2,400 నుంచి రూ.3,200కు పెంచడం, ఇతర పంటల రేట్లను 50 శాతానికి పెంపు.