Fadnavis as The CM of Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తరువాత పరిణమాలు చాలా వేగంగా మారుతున్నాయి. సీఎం ఉద్దవ్ థాక్రే రాజీనామాతో బీజేపీ ప్రభత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఫడ్నవీస్ రెడీ అవుతున్నారు. అందుకు సంబంధించిన పనులు చకచకా సాగిస్తున్నారు. 106 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి షిండే వర్గం మద్దతు ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం షిండే టీం గోవాలో ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ షిండేను కలిసి మంతనాలు జరుపుతున్నారు. అయితే ఇప్పుడు గవర్నర్ నిర్ణయం కీలకంగా మారనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ పచ్చ జెండా ఊపితే మహారాష్ట్రలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొనసాగనుంది.
గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆమోదిస్తే పఢ్నవీస్ రేపు అంటే జూలె 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన ఆయన ప్రస్తుతం బాధ్యతలు తీసుకుంటే మూడోసారి సీఎం అయినట్లు అవుతుంది. అటు థాక్రే రాజీనామా అంశం కూడా గవర్నర్ వద్దే ఉంది. ఈరెండు విషయాలపై గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ముంబై పోలీస్ కమిషనర్ కూడా నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో వివేక్ ఫనసాల్కర్ బాధ్యతలు తీసుకుంటారు. ఇన్నాళ్లు శివసేన ప్రభుత్వం నుంచి బీజేపీ ప్రభుత్వానికి మారిన నేపథ్యంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సి ఉంది. దీంతో కొత్త కమిషనర్ కు సవాల్ గా మారనుంది.
Also Read: Chandrababu- KCR: చంద్రబాబు చేయలేదు సరే.. మరి కేసీఆర్ ఏం చేసినట్టు?
తమ ప్రభుత్వం కూలిపోవడానికి బీజేపీ వెనుకుండి కుట్ర చేస్తుందని శివసేన చేస్తున్న ఆరోపణలు బీజేపీ నాయకులు ఖండించారు. అటు షిండే టీం కూడా బీజేపీకి సపోర్టుగా నిలవనుందని అన్నారు. అయితే తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని శివసేనను పార్ట్ 2గా కొనాగిస్తామని అన్నారు. కానీ ప్రస్తతం బీజేపీ వేగంగా కార్యాచరణను సాగిస్తోంది. ఫడ్నవీస్ సీఎంగా కొనసాగేందుకు మద్దతు ఇవ్వాలని షిండే సభ్యులను కోరనుంది. ఈ నేపథ్యంలో షిండే నిర్ణయం పై కూడా ఆసక్తి నెలకొంది. ఆయన ఇదివరకు చెప్పినట్లు బీజేపీని కాదని కొనసాగుతారా..? లేక కమలంతో కలిసిపోతారా..? అనేది ఆ రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే పార్టీ అధిష్టానం నుంచి తనకు స్పష్టమైన మెసేజ్ రావడంతో ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారు. 106 స్థానాలున్న బీజేపీకి 18 మంది వరకు ఇండిపెండెట్లు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ షిండే వర్గం మద్దతు ఇస్తే అతిపెద్ద కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. కానీ గవర్నర్ స్పందన ఎలా ఉంటుందోనని పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు. అయితే మొత్తంగా బీజేపీకే అనుకూల పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే షిండే వర్గం ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. అటు ఇప్పటికే కాంగ్రెస్ తో విభేదించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వలో కొనసాగే అవకాశం ఉంది.
Also Read:Menu For Modi: మోడీ విందులో తెలంగాణ రుచులు.. స్పెషల్ మెనూ.. వండిపెట్టేది ఎవరో తెలుసా?