Maha Kumbh Gangajal : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా వైభవంగా జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు అక్కడికి వస్తున్నారు. భక్తులు కుంభమేళాలో విశ్వాసంతో స్నానం చేసి తమ ఆత్మను శుద్ధి చేసుకుంటున్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఈ మహాకుంభానికి తరలివస్తున్నారు. గంగాజలం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించబడుతోంది. ప్రతి హిందూ ఇంట్లో దీన్ని భద్రపరుస్తారు. ఈ గంగా జలానికి సంబంధించిన ఒక పాత కథ ఉంది. అది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బ్రిటిష్ కాలంలో గంగా జలాలను అనేక మహాసముద్రాలు దాటి లండన్‌కు తీసుకెళ్లారు. దీని వెనుక కారణం ఏమిటి.. అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
మహారాజా సవాయి మాధో సింగ్ అచంచలమైన భక్తి
రాజులు , చక్రవర్తుల కాలంలో కూడా గంగా జలం ఎంతటి పవిత్రమైన నీటిగా పరిగణించబడిందంటే దానిని ఒక్క స్పర్శతో పవిత్రంగా మారిపోతారు ఈ కారణంగానే వేల లీటర్ల గంగా జలాన్ని వెండి కుండల్లో లండన్‌కు పంపించి అక్కడ శుద్ధి చేశారు. దీని వెనుక మహారాజా సవాయి మాధో సింగ్ II కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అతను నిజమైన గంగా భక్తుడు.గంగా నీటిని తన నుండి వేరు చేయలేరు.
ఇది గంగాజలం లండన్ చేరిన కథ.
బ్రిటన్ భవిష్యత్తు రాజు జైపూర్ మహారాజా సవాయి మాధో సింగ్ II ను తన పట్టాభిషేక కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు, మహారాజా ముందు ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. ఆ కాలంలో హిందువులు సముద్రం దాటి వేరే దేశానికి వెళ్లడం అశుభంగా భావించేవారు. ఆ ఆహ్వానం బ్రిటన్ రాజు నుండి వచ్చినందున దానిని తిరస్కలించలేకపోయాడు.
లండన్‌కు చేరుకున్న 8 వేల లీటర్ల గంగాజలం
అందరు మంత్రులు, గురువులతో చర్చించిన తర్వాత ఒక పరిష్కారం దొరికింది. ప్రయాణించేందుకు ఏ రకమైన మాంసం కూడా వండని ఓడను కనుగొనాలని నిర్ణయించారు. ప్రయాణమంతా మహారాజు గంగా జలాన్ని మాత్రమే తాగి దానితో స్నానం చేయాలని కూడా నిర్ణయించారు. దీని తరువాత ఒలింపియా అనే ఓడను లక్షల రూపాయలకు అద్దెకు తీసుకుని అందులో 8 వేల లీటర్ల గంగా జలాన్ని భారీ వెండి కుండలలో నింపారు. ఇది కాకుండా, అనేక మంది పూజారులు, సేవకులు కూడా మహారాజ్ తో పాటు ఉన్నారు.
లండన్ చేరుకున్న తరువాత మహారాజా సవాయి మాధో సింగ్ II కు సాదర స్వాగతం పలికి, రాజభవనంలో వసతి కల్పించారు. ఈ సమయంలో ఎవరైనా ఆంగ్లేయుడు అతనితో కరచాలనం చేసినప్పుడల్లా, మహారాజు గంగా నీటితో చేతులు కడుక్కునేవాడు. అంతేకాకుండా అతని ఆహారం కూడా గంగా నీటిలో వండేవారు. దీని తరువాత, ఇది ఒక సంప్రదాయంగా మారింది. ప్రజలు లండన్ వెళ్ళేటప్పుడు గంగా జలాన్ని తమతో తీసుకెళ్లడం ప్రారంభించారు.