సంపదలో ముఖేష్ అంబానీని దాటేసిన మహిళ!

భారత కుబేరుడు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీని ఓ మహిళ వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముఖేష్ అంబానీ సంపద తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తర్వాత ఉన్న స్థానంలో ఉన్న మహిళ ఒక స్థానం ఎగబాగింది. దీంతో ఆయన ఒక స్థానం కోల్పోయి తాజాగా ప్రపంచ ధనవంతుల్లో 19వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచంలో ధనవంతుల్లో ఒకరికిగా కొనసాగుతున్న ముకేశ్ అంబానీని సంపదలో మెకంజీ బెజోస్ వెనక్కి నెట్టారు. ప్రస్తుతం […]

Written By: Neelambaram, Updated On : April 15, 2020 7:27 pm
Follow us on


భారత కుబేరుడు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీని ఓ మహిళ వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముఖేష్ అంబానీ సంపద తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తర్వాత ఉన్న స్థానంలో ఉన్న మహిళ ఒక స్థానం ఎగబాగింది. దీంతో ఆయన ఒక స్థానం కోల్పోయి తాజాగా ప్రపంచ ధనవంతుల్లో 19వ స్థానంలో కొనసాగుతున్నారు.

ప్రపంచంలో ధనవంతుల్లో ఒకరికిగా కొనసాగుతున్న ముకేశ్ అంబానీని సంపదలో మెకంజీ బెజోస్ వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఆమె సంపదలో ముఖేష్ అంబానీని దాటేయడంతో మరోసారి మెకంజీ వార్తల్లో నిలిచారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన ఫౌండర్ జెఫ్ బెజోస్ మాజీ భార్యనే మెకంజీ బెజోస్. జెఫ్ నుంచి ఆమె విడాకుల తీసుకున్నందుకు భరణం కింద అమెజాన్లో 4శాతం వాటా దక్కింది. ప్రస్తుతం అమెజాన్ షేర్ ధర 5.3శాతం పెరిగింది. దీంతో ఆమె సంపద పెరిగడంతోపాటు ముఖేష్ అంబానీ సంపద తగ్గింది. దీంతో ఆమె ముఖేష్ అంబానీని సంపదలో వెనక్కి నెట్టారు.

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం మెకంజీ బెజోస్ సంపద విలువ ఏప్రిల్ 15నాటికి 8.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ముకేశ్ అంబానీ సంపద విలువ మార్చి 19నాటికి 34.4 బిలియన్ డాలర్లు ఉండగా మెకంజీ సంపద విలువ 45.3బిలయన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఆమె ప్రపంచ మహిళా సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒక స్థానం ఎగబాకి 18వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు. ఈయన సంపద విలువ 138.5 బిలియన్ డాలర్లు. ఏప్రిల్ 15న ఈయన సంపద విలువ 24బిలియన్ డాలర్లకు పెరిగిందని బ్లూమ్ బర్గ్ ఇండెన్స్ ప్రకటించింది.