Lunar eclipse
Lunar eclipse : చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వస్తుంది. దీంతో సూర్యుడి కాంతి చంద్రుడిపై పడకుండా ఉంటుంది. దీంతో చంద్రుడు కనిపించకుండా ఉంటాడు. దీనినే చంద్ర గ్రహణం అంటారు. 2025 ఏడాది ప్రారంభం అయిన తరువాత మార్చి నెల 14న మొదటి చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఇదే రోజు హోలీ కూడా కావడంతో చాలా మందికి ఓ సందేహం వస్తోంది. హోలీ రోజున చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ రోజున ఎలాంటి నియామాలు పాటించాలి? అసలు చంద్ర గ్రహణం రోజున హోలీ వేడుకలు నిర్వహించుకోవచ్చా? అని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితె..
భారతీయ సాంప్రదాయం ప్రకారం రాహు, కేతువు ప్రభావం వల్ల గ్రహణం ఏర్పడుతుందని అంటారు. రాహువు, కేతువు చంద్రుడిని మింగడానికి ప్రయత్నిస్తారని, ఆ ప్రభావం భూమిపై పడుతుందని భావిస్తారు. దీంతో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటించాలని చెబుతూ ఉంటారు. సూర్య, చంద్ర గ్రహణాల రోజును ప్రత్యేకంగా భావిస్తారు. గ్రహణం సమయంలో కొన్ని కార్యక్రమాలు చేయకూడదు. ఈ సమయంలో ఆలయాలు మూసి వేస్తారు. ఈ సమయంలో ఎలాంటి పూజలు చేయరు. ఆహారాన్ని తయారు చేసుకోవద్దు. ఎలాంటి ఆహార, పానీయాలు సేవించకూడదు. ముఖ్యంగా గర్బిణులు జాగ్రత్తగా ఉండాలి. పదునైన వస్తువులను చేతిలో పట్టుకొనరాదు.. ఇంట్లో ఇష్టదైవాన్ని మాత్రమే స్మరించుకుంటూ ఉండాలి. సాధారణంగా చంద్ర గ్రహణం రాత్రి సమయంలో వస్తుంది. అందువల్ల ఈ నియమాలు ప్రత్యేకంగా పాటించాల్సిన అవసరం ఉండదు.
Also Read : చంద్రగ్రహణం సందర్భంగా ప్రతికూల శక్తి పోవాలంటే.. ఈ మంత్రాన్ని పఠించాలి.. అదేంటంటే?
అయితే 2025 మార్చి 14న ఉదయం 9.29 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 3. 29 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో భారత్ లో చంద్రుడు కనిపించడు. అందువల్ల చంద్ర గ్రహణం ప్రభావం ఎంత మాత్రం ఉండదు. ఈ ప్రభావం ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ ఉత్తర ధ్రువంలో కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో రాత్రి సమయం ఉన్నందున చంద్ర గ్రహణం కనిపిస్తుంది. అందువల్ల భారత్ లో సూతకాలం పనిచేయదని కొందరు పండితులు చెబుతున్నారు. దీంతో ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే ఈ సమయంలో ఆలయాలు మూసివేసే అవకాశం ఉంది.
ఇక ఇదే రోజు హోలీ పండుగ ఉన్నందున.. ఈ కాలంలో చాలా మంది ఈ వేడుకల్లో మునిగిపోయే అవకాశం ఉంది. హోలీ పండుగ సందర్భంగా ఒకరినొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. దీని కంటే ఒకరోజు ముందు కాముడి దహనం కార్యక్రమం ఉంటుంది. భారత్ లో గ్రహణ ప్రభావం లేనందున హోలీ పండుగను జరుపుకోవచ్చని అంటున్నారు. అయితే హోలీ పండుగ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రసాయనాలు కలిపిన కలర్లు కాకుండా సాధారణ రంగులోనే హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని చెబుతున్నారు.
Also Read : నేడు చంద్రగ్రహణం..ఈ రాశివారు ఏం చేయాలి? ఏం చేయవద్దంటే?