Lunar Eclipse 2023 : నేడు చంద్రగ్రహణం..ఈ రాశివారు ఏం చేయాలి? ఏం చేయవద్దంటే?

చంద్రగ్రహణం భారత్ తో పాటు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ దేశాల్లో కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం ఈ ఏడాదిలో చివరి గ్రహణంగా పేర్కొంటున్నారు.

Written By: NARESH, Updated On : October 28, 2023 10:14 am
Follow us on

Lunar Eclipse 2023 : పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 2023 అక్టోబర్ 14న సూర్యగ్రహణం ఏర్పడినా భారత్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ అక్టోబర్ 29న ఏర్పడే చంద్రగ్రహణం భారత్ లో కనిపించనుంది. అక్టోబర్ 28న అర్ధరాత్రి అంటే 29న ఉదయం 1.16 గంటలకు చంద్రగ్రహణం ఏర్పడి 1.44 గంటలకు ముగుస్తుందని అర్చకులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూతక కాలం గ్రహణం కంటే 9 గంటల ముందే సూతక్ కాలం ప్రారంభమవుతుంది. అంటే 28న మధ్యాహ్నం 2.52 నుంచి జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

అక్టోబర్ 28-29 మధ్య ఏర్పడే చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. మిథునం, వృశ్చిక, కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. సింహ, తుల, మీన రాశి వారికి మధ్యస్తం, మేష, వృషభ, కన్య, మకర రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మేష, వృషభ, కన్య, మకర రాశుల వారు చంద్రగ్రహణం చూడకుండా ఉండడానికి ప్రయత్నించాలంటున్నారు. మిగతా రాశుల వారు చూడొచ్చని చెబుతున్నారు. అయితే ప్రతికూల వాతావరణం ఉన్న రాశులవారు పరిహారం చేసే అవకాశం ఉందని కొందరు పండితులు చెబుతున్నారు. గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలను మూసివేయనున్నారు.

చంద్రగ్రహణం సమయంలో దేవతలను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. రాహు-కేతు మంత్రాలను పఠించాలంటున్నారు. గ్రహణం సమయంలో శత్రువులు ఏదైనా ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తే.. ఈ సమయంలో హనుమాన్ చాలీచా చదవడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయంటున్నారు. చంద్రగహణం ముగిసిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా స్నానం చేయాలని చెబుతున్నారు.

చంద్రగ్రహణం భారత్ తో పాటు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ దేశాల్లో కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం ఈ ఏడాదిలో చివరి గ్రహణంగా పేర్కొంటున్నారు. గ్రహణం సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ సమయంలో గర్భిణీలు ఎలాంటి ఆహారం తీసుకోవద్దని అంటున్నారు. అయితే జన విజ్ఞాన వేదికకు చెందిన వారు మాత్రం వాతావరణంలో జరిగే సహజ మార్పులకు ప్రత్యేక పూజలు చేయొద్దని అంటున్నారు.