Jaipur: అప్పటికే పెళ్లయిన మహిళను కోరుకున్నాడు. ప్రేమించాచనని వెంట పడ్డాడు. ఇద్దరు పిల్లల తల్లిని కావాలని ఆరాటపడ్డాడు. కుదరదని చెబితే వినలేదు. నువ్వే కావాలని వేధింపులకు గురిచేశాడు. పెళ్లయి పిల్లలున్న దాన్ని ఎలా అడుగుతున్నావని బెదిరించినా వినలేదు. చివరకు ఆమె ప్రాణాలు తీశాడు. తనలోని కసాయి తనాన్ని బయటపెట్టాడు. నూరేళ్ల జీవితాన్ని చిదిమేశాడు. కలకలం సృష్టించిన ఈ ఘటన రాజస్తాన్ లో చోటుచేసుకుంది.

జైపూర్ సమీపంలోని ఆహోర్ ప్రాంతంలో శాంతిదేవి అనే మహిళ శాంతిలాల్ అనే అతడిని పెళ్లి చేసుకుని సజావుగా కాపురం చేస్తోంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఉద్యోగ రీత్యా ఆమె భర్త మహారాష్ర్టలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు వచ్చి పోయే భర్తతో హాయిగా ఉంటోంది శాంతిదేవి. అయితే వీరి కాపురంలో ఓ కలత మొదలైంది.
అదే ప్రాంతానికి చెందిన గణేష్ (25) అనే యువకుడు శాంతిలాల్ ఇంటికి తరచు వస్తుండేవాడు. ఈ క్రమంలో గనేష్ కన్ను శాంతిదేవిపై పడింది. తనను ప్రేమిస్తున్నానని చెప్పాడు. తనకు పెళ్లయి పిల్లలున్నారని చెప్పింది. అయినా వినలేదు. తనలోని కర్కశత్వాన్ని బయటపెట్టాడు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి ఆమె ససేమిరా అంది. దీనిపై ఇక మాట్లాడేది లేదని తెగేసి చెప్పింది.
అయినా అతడిలో మార్పు రాలేదు. రాత్రి పూట శాంతి దేవి ఇంటికి వెళ్లిన గణేష్ మళ్లీ అదే మాట చెప్పాడు. దీనికి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలా మాట్లాడితే పోలీసులకు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో కోపోద్రిక్తుడైన గణేష్ కొడవలి తీసుకుని శాంతిదేవిని నరికాడు. దీంతో ఆమె చనిపోయింది. పోలీసులు వెళ్లి చూడగా గణేష్ శవానికి ముద్దులు పెడుతున్నాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
Also Read: మాంసంలో అంత్రాక్స్.. మాంసాహారులు జాగ్రత్త