Lovers: కలిసి నడవాలనుకున్నారు. జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నారు. ఎన్నో కలలు కన్నారు. ప్రేమతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నారు. భవిష్యత్ కోసం బంగారు కలలు కన్నారు. ఊసులు చెప్పుకున్నారు. ఆలోచనలు పంచుకున్నారు. అనురాగాలు పెంచుకున్నారు. ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగింది. ఇక వివాహం చేసుకుని స్థిరపడాలని అనుకున్నారు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లు విధి వంచించింది. అదృష్టం వెక్కిరించింది. అనుకున్నది సాధించుకోవాలనుకున్నా నెరవేరలేదు.

నాగిలిగిద్ద మండలం మాయినెళ్లి గ్రామానికి చెందిన అనిల్ (25), సంగారెడ్డిలోని భగత్ సింగ్ కాలనీకి చెందిన కృష్ణ వేణి (28) పరస్పరం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. వారి ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియజేశారు. కానీ వారు ఒప్పుకోలేదు.అయితే వారి తల్లిదండ్రులు చెప్పే కారణాలు కూడా చిన్నవే అయినా వారు నో చెప్పడంతో వారు కలత చెందారు.
సామాజిక వర్గాలు వేరు, వయసులో వ్యత్యాసం ఉందని చెప్పి వారి పెళ్లికి నిరాకరించడంతో వారు బతుకు మీద ఆశలు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 5న అనిల్, కృష్ణవేణి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వారి కోసం వెతికినా ప్రయోజనం లేదు. దీంతో సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Rajasthan Woman: బాయ్ ఫ్రెండ్ కోసం పాకిస్తాన్ వెళ్లాలనుకున్న రాజస్థాన్ వివాహిత అంత పనిచేసింది?
రాయికోడ్ మండలంలోని సిరూర్ గ్రామ సమీపంలో మంజీర నదిపై అనుమానాస్పదంగా ఓ ద్విచక్రవాహనం ఉండటంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఆరా తీయగా అనిల్ దిగా గుర్తించారు. నదిలో గాలింపు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం కృష్ణవేణి మృతదేహం లభించింది. శనివారం అనిల్ మృతదేహం కూడా దొరికింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Omricon Effect: ఒమ్రికాన్ ఎఫెక్ట్.. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మరణాలు..!
[…] […]