Ramesh Babu Death : స్టార్ హీరోగా కృష్ణ వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత టాలీవుడ్ బడా హీరోగా కృష్ణ పరిశ్రమను ఏలారు. ఐదు దశాబ్దాలుగా కృష్ణ నట ప్రస్థానం కొనసాగింది. అలాంటి ఓ స్టార్ హీరో వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు మాత్రం… కనీసం ఓ మోస్తరు హీరో కాలేకపోయారు.
పిల్లల్ని కూడా పరిశ్రమలో నిలబెట్టాలి, గొప్ప నటుల్ని చేయాలనే ఉద్దేశంతో కృష్ణ.. రమేష్ బాబు, మహేష్ బాబులను చైల్డ్ ఆర్టిస్ట్స్ గా పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన ఇద్దరు కుమారుల్లో మహేష్ టాలీవుడ్ టాప్ స్టార్ హోదా దక్కించుకుంటే.. రమేష్ బాబు ప్రయాణం మాత్రం విషాదంగా ముగిసింది.
మహేష్ కంటే పదేళ్లు పెద్దవాడైన రమేష్ బాబు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమయ్యారు. కృష్ణ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు మూవీ రమేష్ బాబుకు మొదటి చిత్రం. ఈ మూవీలో రమేష్ బాబు అల్లూరి చైల్డ్ హుడ్ రోల్ చేశారు.
ఆ తర్వాత కృష్ణ నటించిన `మనుషులు చేసిన దొంగలు` `నీడ` చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ మూవీలో మహేష్‌బాబు కూడా నటించడం విశేషం. వీటితో పాటు `దొంగలకు దొంగ`, `అన్నదమ్ముల సవాల్`, `పాలు నీలు` చిత్రాల్లో బాలనటుడిగా నటించి మెప్పించారు.
`సామ్రాట్` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రమేష్‌బాబు. 1987లో విడుదలైన ఈ చిత్రానికి వి మధుసూధన్ రావు దర్శకత్వం వహించారు. తొలి చిత్రంతో ఫర్వాలేదనిపించుకున్నారు రమేష్‌బాబు. ఆ తర్వాత కామెడీ ఎక్స్పర్ట్ జంధ్యాల దర్శకత్వంలో `చిన్ని కృష్ణుడు` చిత్రంలో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కోదండరామిరెడ్డి రూపొందించిన `బజార్ రౌడీ` చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. హీరోగా ఆయనకు ఇది మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
ఆ తర్వాత `కలియుగ కర్ణుడు`, `ముగ్గురు కొడుకులు` చిత్రాలు కృష్ణ దర్శకత్వంలో నటించారు. `ముగ్గురు కొడుకులు` చిత్రంలో కృష్ణ, మహేష్‌లతో కలిసి నటించారు. దాసరి దర్శకత్వంలో `బ్లాక్ టైగర్`, `వి మధుసుధన్ రావు దర్శకత్వంలో `కృష్ణ గారి అబ్బాయి`,తోపాటు `ఆయుధమ్`, `కలియుగ అభిమన్యుడు`, `నా ఇల్లే నా స్వర్గం` వంటి చిత్రాలతో నటించారు. మొదట్లో పర్వాలేదు అనిపించుకున్న రమేష్ బాబు చిత్రాలు.. వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఆయన కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. అలాగే రమేష్ బాబు మొదలుపెట్టిన రెండు జానపద చిత్రాలు అనుకోకుండా మధ్యలో ఆగిపోయాయి.
Also Read: Ramesh Ghattamaneni : ఆ నిర్ణయంతోనే రమేష్ బాబు సినీ జీవితం ముగిసింది !
ఓ స్టార్ హీరో కొడుకుగా పుట్టిన రమేష్ బాబు ఓ స్థాయికి చేరుకోవడంలో విఫలమయ్యారు. ఇది ఆయనను డిప్రెషన్ లోకి నెట్టింది. మానసిక వేదన కారణంగా చెడు అలవాట్లకు బానిస అయ్యారు. కృష్ణ కుటుంబానికి అంత పేరున్నా.. రమేష్ బాబు మాత్రం వెండితెర నుండి విరామం తీసుకున్నాక.. మీడియా కంటపడడం మానేశాడు. అలాగే ఆయన కుటుంబాన్ని కూడా మీడియా ఫోకస్ లోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. రమేష్ బాబుకు ఓ కూతరు, కొడుకు. కొడుకు పేరు జయ కృష్ణ . Ramesh Babu Deathమహేష్ పిల్లలు సితార, గౌతమ్ గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. అదే సమయంలో రమేష్ బాబు పిల్లల గురించి మాత్రం అసలు ఎవరికీ ఐడియా లేదు.
Also Read: Ramesh Babu death: రమేష్ బాబు మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం..!