Mahesh Family: రమేశ్ బాబు మృతిపై మహేష్ ఫ్యామిలీ ఎమోషనల్ స్పందన

Mahesh Family Emotional: సూపర్ స్టార్ కృష్ణ పెద్దకుమారుడు, ప్రముఖ హీరో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు ఇక లేరనే వార్తను అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో రమేష్ బాబుకు దాదాపు 40ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. కృష్ణగారి వారుసుడిగా రమేష్ బాబు తన 12వ యేటనే సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తన తండ్రితో కలిసి ‘మనుషులు చేసిన దొంగలు’ అనే సినిమాలో బాలనటుడిగా కన్పించాడు. ఆ తర్వాత దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ‘నీడ’ […]

Written By: Raghava Rao Gara, Updated On : January 9, 2022 11:22 am
Follow us on

Mahesh Family Emotional: సూపర్ స్టార్ కృష్ణ పెద్దకుమారుడు, ప్రముఖ హీరో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు ఇక లేరనే వార్తను అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో రమేష్ బాబుకు దాదాపు 40ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. కృష్ణగారి వారుసుడిగా రమేష్ బాబు తన 12వ యేటనే సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తన తండ్రితో కలిసి ‘మనుషులు చేసిన దొంగలు’ అనే సినిమాలో బాలనటుడిగా కన్పించాడు.

ఆ తర్వాత దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ‘నీడ’ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేశాడు. 1987లో రమేష్ బాబు పూర్తి స్థాయి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. హిందీలో సూపర్ హిట్ ‘బేతాబ్’ మూవీని తెలుగులో ‘సామ్రాట్’ పేరుతో తెలుగు రీమేక్ చేశారు. ఈ మూవీ ద్వారా రమేష్ బాబు టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది.

ఆ తర్వాత ‘చిన్నికృష్ణుడు’, ‘బజార్ రౌడీ’ చిత్రాల్లో నటించారు. ఇప్పటి సీనియర్ నటి నదియా ‘బజార్ రౌడీ’లో రమేష్ బాబుకు జోడీగా నటించింది. ఈమూవీ భారీ విజయం సాధించింది. అయితే ఆ సక్సస్ ను రమేష్ బాబు కొనసాగించలేకపోయాడు. కృష్ణ నటించిన ‘ఎన్ కౌంటర్’ మూవీలో రమేష్ బాబు ఓ స్పెషల్ రోల్ చేశాడు. ఇదే ఆయన నటించిన చివరి చిత్రంగా నిలిచిపోయింది.

రమేష్ బాబు నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. అమితాబచ్చన్ నటించిన హిందీ ‘సూర్యవంశం’ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. మహేష్ బాబు నటించిన ‘అర్జున్’, ‘అతిథి’, ‘దూకుడు’, దూకుడు’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. 2014లో వచ్చిన ‘ఆగడు’ చిత్రమే రమేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన చివరి సినిమాగా మిగిలింది.

ఇదిలా ఉంటే రమేష్ బాబు మృతిపై ఘట్టమనేని ఫ్యామిలీ ఒక ఎమోషనల్ ప్రకటన విడుదల చేసింది. ‘రమేష్ బాబు ఇకలేరనే వార్తను అత్యంత విషాదంతో తెలియజేస్తున్నాం.. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ.. మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు.. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించండి.. సాధ్యమైనంత వరకు అంత్యక్రియలకు దూరంగా ఉండండి..’ అంటూ కృష్ణ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనను విడుదల చేశారు. మరోవైపు రమేష్ బాబు అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు.