Palnadu: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉంది. కానీ, రాజకీయ క్షేత్రంలో అప్పుడే రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఫైట్ వెరీ టఫ్ ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల మాచర్ల నియోజకవర్గంలో పట్టపగలు ఓ టీడీపీ నాయకుడి పీక కోసి చంపేశారు. ఈ క్రమంలోనే ఆ వెంటనే నర్సరావుపేటలో అదే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఏకంగా నియోజవర్గ ఇన్‌చార్జి పైనే పోలీసులు దాడులు చేశారు. దాంతో రాజకీయ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా మారాయి.

సాధారణంగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడినపుడు పోలీసులు వాటిని చల్లబరిచేందుకు ప్రయత్నించాలి. కానీ, పల్నాడులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ నేతల మాటలు చెప్తూ పోలీసులు అనుమానాస్పద స్థితిలో విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. చంద్రయ్య అనేటువంటి టీడీపీ నేత.. వైసీపీ నేతను చంపుతానని చెప్పారని, అందుకే అతనిని చంపేశారని నిందితుల వాయిస్‌ను పోలీసులు చెప్తున్నారు.
Also Read: సంక్రాంతి సినిమాలకు పొంచివున్న ముప్పు..!
అలా నిందితుల తరఫు వాదనను మీడియా ఎదుటే పోలీసులు బలపరుస్తున్నారు. ఇక ఆ తర్వాత నర్సరావుపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అరవింద్ బాబు ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు బలవంతంగా మాత్రమే కాదు.. దౌర్జన్యంగా ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయనపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. చివరికి ఆయనను పోలీసులే ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఇలా పోలీసులు పావులుగా మారి రాజకీయ ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నారని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
అలా పల్నాడులో పోలీసులు ఉద్రిక్త పరిస్థితుల నడుమ విధులు నిర్వహిస్తుండటంతో పాటు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల పోలీసులు ఎమ్మెల్యే చెప్పాడని ఓ రైతుపైన తప్పుడు హత్యాయత్నం కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అలా ప్రజల భద్రత, ప్రాణాల విషయంలో నీతి, నిజాయితీతో వ్యవహరించాల్సిన ఖాకీలు..పావులుగా మారి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి ఘోరమైన అన్యాయం జరిగినట్లేనని, దాని వల్ల వచ్చే దుష్పరిణామాలను పోలీసులు కూడా భరించాల్సి ఉంటుందని చెప్తున్నారు.
Also Read: జగ్గారెడ్డిని కంట్రోల్ చేసిన సీఎల్పీ.. ఒంటరిగా వద్దు.. ఉమ్మడిగా చేద్దాం..!