KTR: టీఆర్ఎస్ భావినేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మినిస్టర్ కేటీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపైన ఫోకస్ పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. అందులో భాగంగానే కేటీఆర్ త్వరలో యూపీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తారని టాక్. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకుగాను కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారని సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్ తృతీయ లేదా ఫెడరల్ ఫ్రంట్‌కు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎస్పీ.. గెలుపు కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తన వంతు పాత్ర పోషించాలని డిసైడ్ అయినట్లు వినికిడి.

దేశంలోని అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆ ఎన్నికల్లో తెలుగువారు ఉన్న చోట్ల ప్రభావం చూపేందుకుగాను కేటీఆర్ ఆయా ప్రాంతాలకు వెళ్తారట. అక్కడ ప్రచారం చేసి ఎస్పీకి క్లీన్ మెజారిటీ వచ్చేందుకుగాను యువనేత కేటీఆర్ ప్రయత్నిస్తారని సమాచారం.
Also Read: ఏపీలో స్కూళ్ల సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన
కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం యూపీతో పాటు ఎన్నికలున్న నాలుగు రాష్ట్రాల్లో బహిరంగ సమావేశాలు, ప్రచార సభలు, ర్యాలీలకు అవకాశం లేదు. కాగా, డోర్ టు డోర్ ప్రచారం మాత్రమే జరగుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ వీలు చూసుకుని ప్రచారానికి వెళ్తారట. కేటీఆర్ నిజంగానే వెళ్తారా? లేక ఇవన్నీ ఉట్టి ఊహాగానాలనేనా? అన్న సంగతి మరి కొన్ని రోజుల్లో తేలనుంది.
ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే దేశంలో ప్రత్యామ్నాయ లేదా తృతీయ లేదా ఫెడరల్ ఫ్రంట్ సాధ్యమనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీల గెలుపు కోసం టీఆర్ఎస్ తన శక్తి మేరకు సాయం చేయాలని డిసైడ్ అయినట్లు కూడా టాక్. అందుకనే ఎస్పీకి టీఆర్ఎస్ ఆర్థిక సాయం చేసినట్లూ వార్తలొస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నిజంగానే అఖిలేశ్ పార్టీకి ఆర్థిక సాయం చేసిందా? లేదా? అనే విషయం తెలియదు. కానీ, కేటీఆర్ అఖిలేశ్ పార్టీ ఈ సారి గెలుస్తుందనే నిశ్చితమైన అభిప్రాయంతో ఉన్నారట. చూడాలి మరి.. ఏం జరుగుతుందో.. నిజంగానే కేటీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారో లేదో..
Also Read: పల్నాడులో పావులుగా మారుతున్న పోలీసులు.. రాజకీయ రచ్చ..
[…] Balakrishna: సినిమా సెట్స్ లో ప్రమాదాలు సర్వసాధారణం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న బచ్చన్ పాండే సినిమా షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో.. షూట్ కి బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందట. అక్షయ్ కుమార్, కృతి సనన్‌లపై కొన్ని సీన్లు తెరకెక్కిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని హిందీ సినీ వర్గాలు చెబుతున్నాయి. […]