
టీడీపీ భావి వారసుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు తిరుపతి ఎన్నికల ప్రచారంలో నవ్వులు పూయిస్తున్నారు. ఆయన భాష పటిమకు పక్కనున్న టీడీపీ నేతలే కాదు.. జనాలు కూడా తెగ నవ్వుకుంటున్నారు. తాజాగా జగన్ ను విమర్శించే క్రమంలో నారా లోకేష్ అన్న డైలాగ్ నవ్వుల బాంబులా పేలింది.
తాజాగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు రోడ్ షోలో జగన్ పై సెటైర్లు వేసే క్రమంలో నారా లోకేష్ నోటి నుంచి స్లిప్ అయిన పదం వైరల్ అయ్యింది. చనిపోయిన తిరుపతి వైసీపీ ఎంపీ కుటుంబాన్ని జగన్ ‘పరామర్శించలేదని’.. అనడానికి.. ‘పరవిశించారా’ అనడంతో అక్కడున్న నేతలు, ప్రజలు ఘోల్లుమని నవ్వారు.
నిజానికి పరామర్శకు, పరవశించడానికి చాలా తేడా ఉంది. ఎవరైనా బాధితులను ఓదార్చడానికి పరామర్శ వాడుతారు. ఏదైనా ఆనందంతో పీక్ స్టేజ్ కి వెళ్లినప్పుడు పరవింశిచిపోతారు. అయితే మన నారాలోకేష్ బాబు ఫారిన్ లో చదువుకొని తేటతెలుగుకు దూరంగా ఉండడంతో ఆయనకు ఈ అర్థాలు తేడాలు సరిగ్గా తెలియవు. అదే ఇప్పుడు నారాలోకేష్ భావ వ్యక్తీకరణలో తప్పులు దొర్లడానికి కారణమవుతున్నాయి.
తిరుపతి ఎన్నికల ప్రచార సభలో నారాలోకేష్ పంచులు, విమర్శలు బాగానే వేస్తున్నారు. జగన్ సర్కార్ ను ఇరుకునపెట్టేలా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ ఒక్క భాష పటిమను సరిచేసుకుంటే లోకేష్ ను మించిన నాయకుడు లేడు అంటారు. కానీ ఏం చేస్తే పుట్టుకతో వచ్చిన పరిజ్ఞానాలు చచ్చే వరకు పోవు. ఇప్పుడిప్పుడే శిక్షకులను పెట్టి నేర్చుకుంటున్న లోకేష్ మున్ముందు ప్రసంగాల్లో ఈ కామెడీ తగ్గించాలని కోరుకుందాం.