Govind Prasad Mehra properties: లంచాలు తీసుకోవడంపై ప్రభుత్వం ఎన్నో రకాలుగా చర్యలు తీసుకుంటున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ తీరు మార్చుకోవడం లేదు. ఏదోరకంగా కొన్ని పనులు పూర్తి చేయడానికి లంచంగా డబ్బు రూపంలో, వస్తువుల రూపంలో తీసుకుంటూ ఉన్నారు. అలా కోట్ల రూపాయల సంపాదిస్తున్నారు. ఇటీవల సిబిఐ జరిపిన దాడుల్లో ఓ పి డబ్ల్యూ డి రిటైర్డ్ డైరెక్టర్ ఆస్తులు చూసి అధికారులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ నియాంశంగా మారింది. అతని కి కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే కాకుండా 17 టన్నుల తేనె, వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ వంటివి బయటపడ్డాయి. అసలు ఇన్ని ఆస్తులు ఈయన ఎలా సంపాదించారు? ఈయన స్టోరీ ఏంటి?
మధ్యప్రదేశ్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ (PWD) చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన గోవిందు ప్రసాద్ మెహ్రా అవినీతి భాగవతం తెలిసి దేశవ్యాప్తంగా దిగ్బ్రాంతికి కృచేసింది. కొంతమంది ఈయన ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారనే ఆరోపణలతో ఫిర్యాదులు చేశారు. దీంతో మధ్యప్రదేశ్ లోకయుక్త అధికారులు భోపాల్, నర్మదాపురం జిల్లాల్లో మెహ్రాకు సంబంధించిన నివాసాలు, వ్యాపార కార్యకలాపాలపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో అతని కి సంబంధించిన వ్యాపారాలు, ఇళ్ల నుంచి రూ. 36 లక్షల కు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2.6 కిలోల బంగారం పట్టుకున్నారు. 5.5 కిలోల వెండిని గుర్తించారు. అయితే స్థిరాస్తులు లెక్కలేనని ఉన్నాయి. జీవిత బీమా పాలసీలు, షేర్ సర్టిఫికెట్లు లభించాయి. ఒక నివాసంలో రూ. 56 లక్షల విలువైన fd లు లభించాయి. అలాగే ఫోర్డ్ ఎండీవర్, స్కోడా స్లావియా, కియా సోనేట్, మారుతి సియాజ్ వంటి లగ్జరీ కార్లను గుర్తించారు.
అయితే వీటన్నిటికంటే ఆశ్చర్యకరమైన ఆస్తులను కనుగొన్నారు. అతనికి sohagpoor తాలూకా షైనీ అనే గ్రామంలో వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ ను నిర్మించారు. ఈ ఫామ్ హౌస్ లో 32 కాటేజీలు ఉన్నాయి. వీటి మధ్య కృత్రిమంగా నిర్మించిన చెరువు ఉంది. దీనిని రిసార్టుగా మార్చేందుకు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే వ్యవసాయ ఉపకరణాలు, కృతిమంగా నీటి కొలనులు ఏర్పాటు చేశారు. ఆరు ట్రాక్టర్లు, చేపల పెంపకం చెరువులు వంటివి ఉన్నాయి. వీటన్నింటికీ మించి 17వేల కిలోల తేనె నిల్వలు లభించాయి. మెహ్రా తేనెటీగల పెంపకం వ్యాపారంలో ఉన్నారని అనడానికి ఇదే నిదర్శనం. అలాగే భోపాల్లోని గోవిందపురం పారిశ్రామిక ప్రాంతంలో పివిసి పైపుల తయారీ కర్మాగారం కూడా గుర్తించారు.
మెహ్రా అధికారిగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద బినామీ ఆస్తులుగా కూడబెట్టినట్లు గుర్తించారు. ఈయన 1984 బ్యాచ్ సివిల్ ఇంజనీర్. 2024 ఫిబ్రవరిలో చీఫ్ ఇంజనీర్ గా ఉన్న సమయంలో పదవీ విరమణ చేశారు. ఒక అధికారి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది.